దుబాయిలోని ప్రవాస భారతీయురాలికి 'ప్రవాసి ప్రసిద్ధ మహిళ' అవార్డు ప్రధానం
- March 13, 2016
ఆర్య వైశ్య అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ (అవోపా), హైదరాబాద్ శాఖ వారు వివిధరంగాల్లో విశేష సేవలందించిన మహిళలను 'ప్రసిద్ధ ఆర్య వైశ్య మహిళ' అవార్డులకు ఎంపికచేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ ఉత్సవాల సందర్భంగా ఆదివారం 13 మార్చి 2016 న హైదరాబాద్ లోని కాచిగూడ వైశ్య హాస్టల్లో నిర్వహించిన కార్యక్రమంలో ఈ అవార్డులను ప్రధానం చేశారు.
దుబాయిలోని ప్రవాస భారతీయ సామాజిక సేవకురాలు శ్రీమతి అరవపల్లి వసుధ గుప్తకు 'ప్రవాసి ప్రసిద్ధ మహిళ' అవార్డును ప్రధానం చేసి ఘనంగా సత్కరించారు. గత 10 ఏళ్లుగా దుబాయిలో నివసిస్తున్న ఆమె వాసవి యూత్ ఎన్నారై అసోసియేషన్ లో చురుకైన సభ్యురాలు. భారతీయ సంస్కృతి గురించి ఆమె 'ప్రజ్ఞ' అనే తరగతులను నిర్వహిస్తున్నారు. కష్టాల్లో ఉన్న ప్రవాసులకు ఆమె సహాయం చేస్తున్నారు.


తాజా వార్తలు
- బహ్రెయిన్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!







