అబుధాబి: పీసీఆర్ టెస్ట్ ఫీజులను సవరించిన ఆరోగ్యశాఖ
- August 18, 2021
అబుధాబి: కోవిడ్ నిర్ధారణ పరీక్షలు పీసీఆర్ టెస్ట్ ఛార్జీలను సవరిస్తూ అబుధాబి అబుదాబి డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ (DoH) ప్రకటన విడుదల చేసింది. సాధారణ పీసీఆర్ టెస్ట్ ఛార్జ్ ను AED 65గా ఫిక్స్ చేసింది. అయితే..అత్యవసర పరిస్థితుల్లో తక్కువ సమయంలోనే రిపోర్ట్ పొందే వారికి విడివిడిగా ధరలను నిర్ణయించింది. ఒకటి నుండి రెండు గంటలలోపు ఫలితాల కోసం AED 350 చెల్లించాల్సి ఉంటుంది. అదే రెండు నుండి ఐదు గంటల్లో ఫలితాల పొందాలనుకంటే AED 250 గా పీసీఆర్ ధరలను ఫిక్స్ చేసింది. ఇక ఇంటి దగ్గరే పీసీఆర్ టెస్ట్ చేయించాలనుకుంటే హెల్త్ కేర్ సెంటర్లను సంప్రదించాలని..వారికి అదనపు రుసుము వర్తిస్తుందని పేర్కొంటూ డిఓహెచ్ వివరించింది. ఇదిలాఉంటే ఎలాంటి లక్షణాలు లేకున్నా టెస్ట్ చేయించుకోవాలనుకుంటే వారి సొంత ఖర్చుతోనే టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది. లక్షణాలు ఉంటే మాత్రం టెస్ట్ ఖర్చు ప్రభుత్వం భరిస్తుంది.
తాజా వార్తలు
- సోషల్ మీడియా దుర్వినియోగం పై సీఎం చంద్రబాబు హెచ్చరిక
- మెడికవర్ హాస్పిటల్స్ లో ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగికి లివర్ మార్పిడి
- 43 గంటలు నాన్-స్టాప్‌గా నడువనున్న దుబాయ్ మెట్రో..!!
- ఒమన్‌లో 2,510 క్యాన్సర్ కేసులు నమోదు..!!
- సౌదీ అరేబియాలో 2,200 హోండా కార్లు రీకాల్..!!
- కతారాలో 'ఫిఫా ప్రపంచ కప్ ఖతార్ 2022 లెగసీ' ప్రదర్శన..!!
- హెయిర్ డై వల్ల గాయాలు, BD5,000 కేసును తిరస్కరించిన కోర్టు..!!
- కువైట్ లో 15 ప్రైవేట్ ఫార్మసీలు సీజ్..!!
- 2026 జనవరి 1 నుంచి రాబోయే అతిపెద్ద మార్పులివే..
- వైభవ్‌కు ప్రతిష్ఠాత్మక బాల్ పురస్కార్







