3-11 ఏళ్ల పిల్లలకు సినోఫార్మ్ వ్యాక్సిన్
- August 18, 2021
బహ్రెయిన్: డెల్టా, డెల్టా ప్లస్ తో చిన్నారులకు ముప్పు పొంచి ఉండొచ్చన్న అంచనాల నేపథ్యంలో బహ్రెయిన్..తమ దేశ చిన్నారులకు ఆరోగ్య భద్రత అందించేలా వ్యాక్సినేషన్ ప్రోగ్రాంను ముమ్మరం చేస్తోంది. 3-11 ఏళ్ల పిల్లలకు కోవిడ్ వ్యాక్సిన్ సినోఫార్మ్ ఇచ్చేందుకు నేషనల్ మెడికల్ టాస్క్ ఫోర్స్ ఆమోదం తెలిపింది. ఫైజర్-బయోన్టెక్ తో పాటు సినోఫార్మ్ వ్యాక్సిన్ను ఇప్పటికే 12-17 ఏళ్ల లోపు బాలబాలికలకు అందించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వ్యాపిస్తున్న వైరస్ వేరియంట్లు నాలుగు రోజుల పాటు లక్షణాలు లేకుండా శరీరంలో తిష్ట వేస్తున్నాయని, దీంతో వ్యాప్తి తీవ్రత మరింత పెరిగే ప్రమాదం ఉందని టాస్క్ ఫోర్స్ హెచ్చరించింది. వైరస్ నుంచి రేపటి తరాన్ని రక్షించుకునేందుకు చిన్నారులకు తప్పనిసరిగా వ్యాక్సిన్ ఇప్పించాలని తల్లిదండ్రులకు సూచించింది. 3-11 ఏళ్ల పిల్లలకు వ్యాక్సిన్ ఇప్పించేందుకు ఆరోగ్య శాఖ వెబ్ సౌట్, బీఅవేర్ యాప్ ద్వారా ముందస్తుగా రిజిస్టర్ చేసుకోవాలని తెలిపింది.
తాజా వార్తలు
- సోషల్ మీడియా దుర్వినియోగం పై సీఎం చంద్రబాబు హెచ్చరిక
- మెడికవర్ హాస్పిటల్స్ లో ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగికి లివర్ మార్పిడి
- 43 గంటలు నాన్-స్టాప్‌గా నడువనున్న దుబాయ్ మెట్రో..!!
- ఒమన్‌లో 2,510 క్యాన్సర్ కేసులు నమోదు..!!
- సౌదీ అరేబియాలో 2,200 హోండా కార్లు రీకాల్..!!
- కతారాలో 'ఫిఫా ప్రపంచ కప్ ఖతార్ 2022 లెగసీ' ప్రదర్శన..!!
- హెయిర్ డై వల్ల గాయాలు, BD5,000 కేసును తిరస్కరించిన కోర్టు..!!
- కువైట్ లో 15 ప్రైవేట్ ఫార్మసీలు సీజ్..!!
- 2026 జనవరి 1 నుంచి రాబోయే అతిపెద్ద మార్పులివే..
- వైభవ్‌కు ప్రతిష్ఠాత్మక బాల్ పురస్కార్







