తెలంగాణలో ముగిసిన కరోనా సెకండ్ వేవ్..
- August 18, 2021
హైదరాబాద్: 18 ఏళ్లు నిండిన వారంతా వ్యాక్సిన్ వేసుకోవాలని తెలంగాణ వైద్యశాఖ సూచించింది. వ్యాక్సిన్ తీసుకుంటేనే పబ్లిక్ ప్లేసుల్లో తిరగడానికి అనుమతిపై ప్రభుత్వం పరిశీలన చేస్తోందని తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు.త్వరలో ఇంటింటికీ వ్యాక్సిన్ ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు.తెలంగాణ రాష్ట్రంలో కొవిడ్ సెకండ్ వేవ్ ముగిసిందని ఆయన వివరించారు.కొవిడ్ చాలావరకు అదుపులోకి వచ్చిందని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో సీజనల్ వ్యాధులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. జ్వరం వస్తే కొవిడ్ కారణంగానే సంక్రమించిందని అనుకోవద్దని ప్రజలకు సూచించారు.
జ్వరం వస్తే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని శ్రీనివాసరావు సూచించారు. సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. భద్రాద్రి, ములుగు జిల్లాల్లో 340 మలేరియా కేసులు నమోదయ్యాయని తెలిపారు.రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 1.65 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్ అందించామని శ్రీనివాస రావు తెలిపారు.56 శాతం మందికి ఫస్ట్ డోస్, 34 శాతం మందికి రెండో డోస్ పూర్తయిందని చెప్పారు.GHMC ఏరియాలో 90 శాతం మంది ప్రజలకు మొదటి డోసు వేశామని తెలిపారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో ఘనంగా శతావధాన కార్యక్రమం
- విద్యార్థుల కోసం పార్ట్నర్ షిప్ సమ్మిట్: సీఎం చంద్రబాబు
- భారత్‌లో 2.5 లక్షల టాటా ఎలక్ట్రిక్ కార్లు
- ఫ్లెమింగో రెస్టారెంట్ తాత్కాలికంగా మూసివేత..!!
- సౌదీలో తగ్గిన బ్యాంకింగ్, పేమెంట్ సేవా రుసుములు..!!
- యూఎస్ కాన్సులేట్ 3 రోజులపాటు మూసివేత..!!
- లైసెన్స్ లేకుండా అడ్వర్టైజ్.. KD 500 జరిమానా..!!
- బహ్రెయిన్‌లో TRA శాటిలైట్ డైరెక్ట్-టు-డివైస్ సేవలు..!!
- ఒమాన్-సౌదీ ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం..!!
- మిషన్ భద్రత పై భారత రాయబారికి బంగ్లాదేశ్ సమన్లు







