సరికొత్త 3డి మోడలింగ్‌ టెక్నాలజీని ఆవిష్కరించిన అపోలో హాస్పిటల్స్‌!

- August 18, 2021 , by Maagulf
సరికొత్త 3డి మోడలింగ్‌ టెక్నాలజీని ఆవిష్కరించిన అపోలో హాస్పిటల్స్‌!

హైదరాబాద్‌: అపోలో హాస్పిటల్స్‌ భారతదేశంలోని ప్రముఖ ‘పేషెంట్‌-స్పెసిఫిక్‌’ సొల్యూషన్‌ ప్రొవైడర్‌ అయిన అనాటోమిజ్‌ 3డి మెడ్‌టెక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సహకారంతో రోగి మరియు సర్జన్‌ ఇద్దరికీ అనుకూలంగా ఉండే విప్లవాత్మక 3డి మోడలింగ్‌ టెక్నాలజీని ఆవిష్కరించింది. జూబ్లీహిల్స్‌లోని అపోలో హాస్పిటల్స్‌లో ఈ కార్యక్రమంలో భాగంగా 3డి ప్రింటింగ్‌ ల్యాబ్‌ను ఏర్పాటు చేసింది. సర్జరీ టూల్స్‌ మరియు ప్రోస్థెటిక్‌ ఇంప్లాంట్‌లను ఖచ్చితత్వంతో సర్దుబాటు చేయడానికి 3డి ప్రింటింగ్‌ వీలు కల్పిస్తుంది, ప్రతి రోగికి వారి యొక్క విభిన్న అవసరాలకు అనుగుణంగా, రోగులకు అత్యుత్తమస్థాయి చికిత్సా ఖచ్చితత్వంతో, శరీరంలో తక్కువ కోత మరియు త్వరగా కోలుకోవడం, సంక్లిష్టమైనటువంటి కేసులకు చికిత్సను అందించడానికి, ప్రత్యేకించి పరిసర కణజాలానికి తక్కువ నష్టంతో రిమోట్‌ యాక్సెస్‌తో కూడిన శస్త్రచికిత్సను అందించేందుకు ఈ టెక్నాలజీ ఒక వరమని చెప్పవచ్చు. 3డి మోడలింగ్‌ టెక్నాలజీ అనేది శస్త్రచికిత్సల ద్వారా అనారోగ్యాన్ని, మరణాలను బాగా తగ్గించడానికి మరియు శస్త్రచికిత్స చికిత్సా పద్దతిలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకు రావడానికి సహాయపడుతుంది.

సరికొత్త సాంకేతికతతో సిటి లేదా ఎమ్‌ఆర్‌ఐ స్కాన్‌ల అధారంగా రోగి యొక్క అనాటమీ యొక్క ఖచ్చితమైన ప్రతిరూపాన్ని పున:సృష్టిస్తుంది. శస్త్రచికిత్సకు ముందు అనాటమీని చూడడానికి, శస్త్రచికిత్సకు ముందస్తు ప్రణాళిక వేయడానికి, క్లినికల్‌ విధానాన్ని నిర్ణయించడానికి మరియు అవలంబించిన విధానంపై రోగికి మరియు అతని సహాయకులకు ఖచ్చితమైన సమాచారంను అందించడానికి చికిత్స అందించే సర్జన్‌కు ఈ ఫీచర్‌ ఎంతో సహాయపడుతుంది.

వ్యక్తిగతీకరించిన సంరక్షణతో మందులను అందిస్తున్నప్పుడు, 3డి మోడలింగ్‌ టెక్నాలజీ ఒక గేమ్‌ ఛేంజర్‌ అవుతుంది. ఇది అనేక అవకాశాలను అందిస్తుంది, సర్జన్‌లు ఇప్పటి వరకు సాధారణ కంటి చూపుతో చూడలేని వాటిని కూడా చూసేందుకు వీలు కల్పిస్తుంది, కణజాలం మరియు దాని చుట్టుపక్కల గల అవయవాలకు అతి తక్కువ హానితో శస్త్రచికిత్సను సానుకూలం చేస్తుంది. శస్త్రచికిత్స ఫలితాలతో సంబంధం ఉండే అనిశ్చితి అనేది ఇప్పుడు గతానికి సంబంధించిన అంశం అని అపోలో హాస్పిటల్స్‌ గ్రూప్‌, జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌,  డాక్టర్‌ సంగీతా రెడ్డి అన్నారు.

జెనరిక్‌ శరీర ఇంప్లాంట్లు సరిపోని సందర్భాలలో, రోగి శరీర నిర్మాణానికి తగినట్లుగా ఇంప్లాంట్‌ యొక్క ముందస్తు ఆకారం యొక్క  అవకాశాన్ని కూడా 3డి ఇమేజ్‌ అందిస్తుంది. జెనరిక్‌ ఇంప్లాంట్లు విభిన్న శరీర నిర్మాణ శాస్త్రం మరియు శరీర నిర్మాణాలు కలిగిన రోగులకు అనుగుణంగా తయారు చేయబడినందున, అవి తరచుగా రోగులకు అసౌకర్యాన్ని కలిగిస్తాయి. ఇటువంటి మిస్‌ఫిట్‌ ఇంప్లాంట్లకు కొంత కాలానికి నష్టం జరుగుతుంది మరియు ఇంప్లాంట్‌ జీవిత కాలాన్ని తగ్గిస్తుంది. అలాంటి సమస్యను పరిష్కరించడానికి తిరిగి  శస్త్రచికిత్సలు చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. అయితే, ఈ ఆధునిక టెక్నాలజీ సహాయంతో, బాగా సరిపోయే ఇంప్లాంట్లు రోగులకు అత్యంత ప్రయోజనకరంగా ఉంటాయి. అనుకూలీకరించిన 3డి-ప్రింటింగ్‌ వ్యక్తిగతీకరించిన ఔషధాలతో అపారమైన విలువ అందుతుంది, ప్రత్యేకించి మెదడు, వెన్నెముక మరియు శరీరంలో మూలలో ఉండే ప్రాంతాల యొక్క అత్యంత క్లిష్టమైన శస్త్రచికిత్సల కోసం. ఇది శస్త్రచికిత్సకు ముందస్తు  ప్రణాళికను పెంచుతుంది, ఆపరేషన్‌ వ్యవధిని తగ్గిస్తుంది మరియు ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.

3డి ఇమేజింగ్‌ టెక్నాలజీ శస్త్రచికిత్సకు ముందు రోగి శరీర నిర్మాణ శాస్త్రం ప్రకారం శస్త్రచికిత్స సాధనాలను అనుకూలీకరించుకోవడానికి కూడా సహాయపడుతుంది. అటువంటి అనుకూలీకరణ శస్త్రచికిత్స సమయంలో కట్‌ లేదా డ్రిల్‌ సరైన స్థలంలో, సరైన దిశలో మరియు ముందుగా కొలిచిన లోతు వరకు నిర్ధారిస్తుంది, తద్వారా శస్త్రచికిత్స నాణ్యతను మెరుగుపరుస్తుంది, ఆపరేషన్‌ థియెటర్‌ సమయంను మరియు రోగి గాయాన్ని తగ్గిస్తుంది, అంతేకాకుండా రోగి త్వరగా కోలుకోవడానికి వీలు కల్పిస్తుంది.

3డి ఇమేజింగ్‌ టెక్నాలజీ అపోలో రోగి కేంద్రీకృత విధానానికి కొత్త ప్రేరణను అందిస్తుంది. చికిత్స చేసే సర్జన్‌కు మునుపెన్నడూ లేని సౌలభ్యాన్ని మరియు రోగికి గొప్ప సౌకర్యాన్ని మరియు సానుకూలతను ఈ సాంకేతికత అందిస్తుందని హైదరాబాద్‌ అపోలో హాస్పిటల్స్‌, రీజినల్‌ సిఇఒ, వై.సుబ్రహ్మణ్యం అన్నారు.

అపోలో హాస్పిటల్స్‌, జూబ్లీ హిల్స్‌, అసిస్టెంట్‌ డైరక్టర్‌ మెడికల్‌ సర్వీసెస్‌, డాక్టర్‌ రవీంద్రబాబు మాట్లాడుతూ, 3డి మోడలింగ్‌ టెక్నాలజీలో 3డి ప్రింటింగ్‌ కూడా ఉంటుంది. ఈ సాంకేతికత కనీసం మూడు విధాలుగా ఉపయోగపడుతుంది, ఒకటి ఆపరేషన్‌ థియేటర్‌లో, ప్రస్తుతం సిటి మరియు ఎమ్‌ఆర్‌ఐ స్కాన్‌లను చూడటం ద్వారా సర్జన్‌లు పనిచేస్తున్నారు, ఇవి 2డి చిత్రాలు, ఇప్పుడు ఈ 3డి ప్రింటింగ్‌ సదుపాయంతో సర్జన్‌కు 3డి దృష్టితో చూడవచ్చు, క్లిష్టమైన శస్త్రచికిత్సలు చేయడానికి సర్జన్‌కు వీలు కల్పిస్తుంది. ఈ టెక్నాలజీ వలన రోగికి తక్కువ గాయంతోనే శస్త్రచికిత్స చేయవచ్చు అంతేకాకుండా వైద్యుడికి శస్త్రచికిత్స చేయడం సులభం అవుతుంది. ఇంకొకటి రోగుల శరీరంలోని ఇంప్లాంట్‌లకు సంబంధించినది, ఈ ఇంప్లాంట్లు వేర్వేరు పరిమాణాల్లో ఉంటాయి మరియు రోగికి అవసరమైన పరిమాణానికి దగ్గరగా ఉండేదాన్ని అమర్చవచ్చు. 3డి టెక్నాలజీతో ఇంప్లాంట్‌ను రోగి అవసరానికి అనుగుణంగా అనుకూలీకరించవచ్చు, తద్వారా శస్త్రచికిత్స ఫలితం చాలా బాగుంటుంది. 3డి టెక్నాలజీతో విద్యార్థులకు బాగా అవగాహన కల్పించవచ్చు, ఎందుకంటే వారు దానిని బాగా అర్థం చేసుకోగలుగుతారు. ఈ సాంకేతికత వైద్యం యొక్క భవిష్యత్తుగా ఉండనున్నది మరియు అపారమైన ప్రయోజనాలను అందిస్తుంది.

అపోలో హాస్పిటల్స్‌లోని ప్రముఖ నిపుణులు, 3 డి-ప్రింటింగ్‌ ఉపయోగించి క్లిష్టమైన వైద్య పరిస్థితులతో ఉన్న ముగ్గురు రోగులకు విజయవంతంగా చికిత్స అందించారు మరియు క్లిష్టమైన శస్త్రచికిత్సలు సౌలభ్యంగా చేయగలిగే హామీ ఇస్తున్నారు.

అపోలో హాస్పిటల్స్‌, హార్ట్‌ అండ్‌ లంగ్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ సర్జన్‌, సీనియర్‌ కన్సల్టెంట్‌, డాక్టర్‌ ఎజికె గోఖలే దాదాపు 25 సంవత్సరాల క్రితమే ఒక రోగికి లెఫ్ట్‌ ఇంటర్నల్‌ మమ్మరీ ఆర్టిలరీ గ్రాఫ్టింగ్‌ రీడో సిఎబిజిను చేశారు. ఇందులో సవాలుతో నిండిన అంశం ఏమిటంటే ధమని స్టెర్నమ్‌ యొక్క వెనుక భాగంలో ఇరుక్కుపోయింది. ఛాతీని తెరిచేటప్పుడు అది దెబ్బతినకుండా పనిచేయడంతో పాటు రోగిని సజీవంగా ఉంచడం ఒక సంపూర్ణ అవసరం, ఎందుకంటే ఇతర అన్ని నాళాలు దాదాపు 100% బ్లాక్‌ అయినాయి.

ప్రస్తుతం ఉన్న ఇమేజింగ్‌ టెక్నాలజీతో టాస్క్‌  పెరిగిపోవడమే కాకుండా విపరీతమైన ప్రమాదం కూడా ఉన్నది. గుండె మరియు గ్రాఫ్టింగ్‌ యొక్క 3డి ప్రింటింగ్‌ సురక్షితమైన శస్త్రచికిత్స మార్గాన్ని సృష్టించడానికి మరియు ఎలాంటి ఆపదనైనా నివారించడానికి మాకు సహాయపడిరది. ఇది కోత చేయడానికి మరియు శస్త్రచికిత్స విజయానికి అద్భుతంగా సహాయపడిరదని, డాక్టర్‌ ఎ.జి.కె గోఖలే చెప్పారు.

అపోలో హాస్పిటల్స్‌, జూబ్లీహిల్స్‌, గౌరవ ప్రొఫెసర్‌ & సీనియర్‌ కన్సల్టెంట్‌ గైనకాలజిస్ట్‌, లాపరోస్కోపిక్‌ & రోబోటిక్‌ సర్జన్‌, డాక్టర్‌ రూమా సిన్హా, ఊహించని ప్రదేశాలలో ఎక్కువ ఫైబ్రాయిడ్స్‌తో బాధపడుతున్న 31 ఏళ్ల అవివాహిత మహిళకు మైయోమెక్టోమీ కోసం 3డి మోడల్‌ని ఉపయోగించి రోబోట్‌ సహాయక లాపరోస్కోపిక్‌ మయోమెక్టమీని నిర్వహించారు. పొత్తికడుపు పరీక్షలో 30-32 వారాల గర్భాశయ పరిమాణం క్రమరహితంగా, నిలకడగా మరియు స్థిరంగా ఉన్నట్లు వెల్లడిరచింది. మయోమెక్టమీలో చాలా పెద్ద ఫైబ్రాయిడ్‌లతో పాటు ఉహించని ప్రదేశాలలో ఉండే బహుళ ఫైబ్రాయిడ్‌లు సవాలుగా ఉంటాయి,  అవివాహితురాలైనందున, ఆమెకు తక్కువ కోతతో శస్త్రచికిత్స కావాలి మరియు భవిష్యత్తులో ఆమె తన పునరుత్పత్తి సామర్థ్యాన్ని కాపాడుకోవడం కూడా చాలా అవసరం

3డి మోడల్‌ రోబో అసిస్టెడ్‌ మైయోమెక్టోమీ సమయంలో అన్ని ఇంట్రాఆపరేటివ్‌ మైయోమాస్‌ని ఓరియంటేషన్‌ మరియు గుర్తించడంలో బాగా సహాయపడిరది. 1215 గ్రాముల బరువు కలిగిన వివిధ పరిమాణాలు కలిగిన పన్నెండు మయోమాలను శస్త్రచికిత్స ద్వారా తొలగించినట్లు డాక్టర్‌ రూమా సిన్హా తెలిపారు.

అపోలో క్యాన్సర్‌ ఇనిస్టిట్యూట్‌, హైదరాబాద్‌, కన్సల్టెంట్‌ ఆర్థోపెడిక్‌ ఆంకో సర్జన్‌ మరియు సర్కోమా స్పెషలిస్ట్‌, డాక్టర్‌ రాజీవ్‌ రెడ్డి  ఎడమ సయాటిక్‌ నాచ్‌ యొక్క సంక్లిష్ట శరీర నిర్మాణం నుండి పెద్ద కణితిని తొలగించడానికి ఏడు గంటల పాటు సున్నితమైన మరియు అత్యంత క్లిష్టమైన శస్త్రచికిత్సను నిర్వహించారు. ఎడమ కటి నొప్పి మరియు రెండు సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలో కణితి తొలగింపు కోసం శస్త్రచికిత్స చేయించుకున్న 29 ఏళ్ల మహిళకు, రోగ నిర్ధారణలో ఆమె జాయింట్‌ మృదులాస్థి నుండి పుట్టుకొచ్చిన ఎముక క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు వెల్లడిరచింది. కణితి యొక్క పరిధిని స్పష్టంగా అంచనా వేయడం మరియు సాధారణ ఎముక నుండి కణితిని వేరు చేయడం ద్వారా శస్త్రచికిత్స సవాళ్లను అధిగమించడంలో 3డి మోడల్‌ బాగా సహాయపడిరది. నిజానికి రోగి మరుసటి రోజునే నడవగలిగాడు, శస్త్రచికిత్స సమయంలో తక్కువ కోతతో మరియు చుట్టుపక్కల కణజాలానికి పరిమితమైన నష్టం దీనికి దోహదపడిరది.

3డి ప్రొజెక్షన్‌ సహాయం లేకుండా శస్త్రచికిత్స చేయడం చాలా డిమాండ్‌గా ఉండేది మరియు ఫలితం అంత సమర్థవంతంగా ఉండేది కాదని డాక్టర్‌ రాజీవ్‌ రెడ్డి చెప్పారు.

మైనర్‌ సాలివరీ గ్లాండ్‌ ట్యూమర్‌ ఆఫ్‌ మాక్సిల్లాతో లేదా ఫేసియల్‌ బోన్‌తో బాధపడుతున్న ఒక రోగికి 3ప్రింటింగ్‌ టెక్నాలజీ సహాయంతో  మేము చికిత్సను అందించాము. రాడికల్‌ మాక్సిలెక్టోమీకి 3డి ప్రింటింగ్‌ సహాయంతో,  శస్త్రచికిత్సలో కోత యొక్క పరిధిని ముందుగా ప్లాన్‌ చేయడానికి మరియు ఆపరేషన్‌ సమయాన్ని తగ్గించుకోవడానికి ఉపయోగపడుతుంది, అంతేకాకుండా వైద్య బోధనలో విపులంగా వివరించే ఉపకరణంగా కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది’’ అని అపోలో క్యాన్సర్‌ ఇనిస్టిట్యూట్‌, హైదరాబాద్‌, సీనియర్‌ రోబోటిక్‌ సర్జికల్‌ అంకాలజిస్ట్‌, డా॥ చిన్నబాబు సుంకవల్లి అన్నారు.

అపోలో హాస్పిటల్స్‌ గురించి :

1983లో డాక్టర్‌ ప్రతాప్‌ సి రెడ్డి భారతదేశపు మొట్టమొదటి కార్పొరేట్‌ ఆసుపత్రి - అపోలో హాస్పిటల్స్‌ను చెన్నైలో ప్రారంభించడం ద్వారా ఒక మార్గదర్శకమైన ప్రయత్నం చేశారు.

ఇప్పుడు, ఆసియాలోనే మొట్టమొదటి విశ్వసనీయ ఇంటిగ్రేటెడ్‌ హెల్త్‌కేర్‌ గ్రూపుగా, 12,000 పడకలతో 72 హాస్పిటల్స్‌, 4150కి పైగా ఫార్మసీలు, 120కి పైగా ప్రైమరీ కేర్‌ క్లినిక్‌లు మరియు 650 డయాగ్నొస్టిక్‌ సెంటర్లు, 700 ప్లస్‌ టెలిక్లినిక్స్‌, 15 కి పైగా వైద్య విద్యా కేంద్రాలు మరియు రీసెర్చ్‌ ఫౌండేషన్‌లో గ్లోబల్‌ క్లినికల్‌ ట్రయల్స్‌పై దృష్టి పెట్టింది. ఆగ్నేయాసియా యొక్క మొట్టమొదటి ప్రోటాన్‌ థెరపీ సెంటర్‌ను చెన్నైలో ప్రారంభించడం ఇటీవలి కాలంలో జరిగిన గొప్ప పరిణామాం.

ప్రతి నాలుగు రోజులకు, అపోలో హాస్పిటల్స్‌ గ్రూప్‌ ఒక మిలియన్‌ మంది జీవితాలను తాకుతున్నది, అంతర్జాతీయ ప్రమాణాల ఆరోగ్య సంరక్షణను ప్రతి వ్యక్తికి అందుబాటులోకి తీసుకురావాలన్నదే దాని లక్ష్యం. ఒక అరుదైన గౌరవార్థంగా భారత ప్రభుత్వం అపోలో యొక్క సహకారాన్ని గుర్తించి స్మారక స్టాంప్‌ను విడుదల చేసింది, ఆరోగ్య సంరక్షణ సంస్థకు సంబంధించి ఇదే మొదటిది. అపోలో హాస్పిటల్స్‌ చైర్మన్‌ డాక్టర్‌ ప్రతాప్‌ సి రెడ్డికి 2010 లో ప్రతిష్టాత్మక పద్మ విభూషణ్‌ పురస్కారాన్ని ప్రదానం చేశారు.

37 సంవత్సరాలుగా, అపోలో హాస్పిటల్స్‌ గ్రూప్‌ వైద్య ఆవిష్కరణ, ప్రపంచ స్థాయి క్లినికల్‌ సర్వీసెస్‌ మరియు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంలో నిరంతరం రాణించి, నాయకత్వాన్ని కొనసాగించింది. దేశంలోని ఉత్తమ ఆసుపత్రులలోఅధునాతన వైద్య సేవలకు దాని ఆసుపత్రులు నిలకడగా సేవలు అందిస్తున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com