భారత్ నుండి కువైట్ కు నేరుగా విమానాలు అనుమతి

- August 19, 2021 , by Maagulf
భారత్ నుండి కువైట్ కు నేరుగా విమానాలు అనుమతి

కువైట్: కువైట్ లో బుధవారం నాడు జరిగిన క్యాబినెట్ సమావేశంలో భారత్,ఈజిప్ట్, బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంక మరియు నేపాల్‌తో వాణిజ్య విమానాల కార్యకలాపాలను పునఃప్రారంభించాలని నిర్ణయించింది. అయితే కరోనా అత్యవసర పరిస్థితుల కోసం మంత్రివర్గ కమిటీ నిర్దేశించిన అన్ని నియంత్రణలకు కట్టుబడి ఉంది.

ఈ నిర్ణయం ఆగస్టు 22 నుంచి అమలులోకి వస్తుంది.విమానాశ్రయం యొక్క కార్యాచరణ సామర్థ్యాన్ని రోజుకు 15,000 మంది ప్రయాణికులకు పెంచాలని మంత్రివర్గం నిర్ణయించింది.

--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com