సౌదీపై హౌతీ దాడి యత్నాన్ని ఖండించిన బహ్రెయిన్
- August 20, 2021
బహ్రెయిన్: తమ సోదర దేశమైన సౌదీ అరేబియాపై హౌతీ మిలిషియా డ్రోన్ దాడికి ప్రయత్నించటాన్ని బహ్రెయిన్ తీవ్రంగా ఖండించింది. ఇరాన్ మద్దతుతో చెలరేగిపోతన్న తీవ్రవాద సంస్థ హౌతీ మిలిషియా ఉగ్రవాద సంస్థ..సౌదీ అరేబియా ఆస్తులు, ప్రజలను లక్ష్యంగా చేసుకొని పదే పదే దాడులకు ప్రయత్నిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ దేశ పౌరుల భద్రత, దేశ సుస్థిరత, ప్రాదేశీక సమగ్రత కోసం హౌతీ దాడులను నిలువరించేందుకు సౌదీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్నా తమ పూర్తి మద్దతు ఉంటుందని బహ్రెయిన్ విదేశాంగ శాఖ వెల్లడించింది. హౌతీ ప్రయోగించిన డ్రోన్ ను తమ గగన తలంలోనే నిలువరించి నాశనం చేసిన యెమన్ పై ప్రశంసలు కురిపించింది. సంకీర్ణ బలగాల అప్రమత్తకు ఇది నిదర్శనమని పేర్కొంది.
తాజా వార్తలు
- భారత విమానాశ్రయాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి
- ఖతార్‌లో భారీగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- రియాద్‌లో 84% తక్కువ ధరకే రెసిడెన్సీ ప్లాట్ లు..!!
- రస్ అల్ ఖైమాలో భారత కార్మికుడు మృతి..!!
- కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!
- ఒమన్ లో చిన్నారిని రక్షించిన రెస్క్యూ టీమ్..!!
- బహ్రెయన్ లో బీభత్సం సృష్టించిన వర్షాలు..!!
- ఎంపీలకు తేనీటి విందు ఇచ్చిన స్పీకర్ ఓం బిర్లా..
- డిసెంబర్ 31లోపు ఈ పనులు చేయకపోతే భారీ జరిమానా!
- తిరుమల వెళ్లే భక్తులకు ఆర్టీసీ శుభవార్త







