మోమోస్
- August 20, 2021
కావలసిన పదార్ధాలు:
పైన కవరింగ్ కి: మైదా 1 కప్ , ఆయిల్ 1 టేబుల్ స్పూన్, సాల్ట్ తగినంత
లోపల స్టెఫిన్గ్ కి: సన్నగా తరిగిన క్యాబేజీ 1 కప్, తురిమిన క్యారెట్ హాఫ్ కప్, సన్నగా తరిగిన కాప్సికం 2 టేబుల్ స్పూన్స్,
సన్నగా తరిగిన పచ్చిమిర్చి ఒకటి,కారం పావు స్పూన్, పసుపు పావు స్పూన్, సన్నగా తరిగిన కొత్తిమీర 2 టేబుల్
స్పూన్స్, 1 టేబుల్ spoon ఆయిల్, కిచెన్ కింగ్ మసాలా ఒక టేబుల్ స్పూన్, సాల్ట్ తగినంత.తయారు చేయు విధానం: మైదా పిండిలో ఉప్పు, నూనె వేసి నీళ్లు కలుపుతూ చపాతి పిండిలా కలిపి, మూత పెట్టి పావు గంట పక్కన ఉంచాలి. ఈ లోపల స్టవ్ మీద పాన్ పెట్టి, దానిలో ఆయిల్ వేసి, వేడి అయ్యాక పచ్చిమిర్చి వేసి ఒక పది సెకండ్స్ వేయించాక , తరిగిన క్యాబేజీ, కార్రోట్ వేసి 2 నిమిషాలు వేయించి అప్పుడు కాప్సికం వేసి ఇంకో అర నిమిషం వేయించాక, కారం,పసుపు, కిచెన్ కింగ్ మాసాల, కొత్తిమీర, సాల్ట్ వేసి ఇంకో నిమిషం వేయించి స్టవ్ ఆఫ్ చేసి, చల్లారనివ్వాలి. ఈ స్టెఫిన్గ్ కొంచెం పచ్చి గానే ఉండాలి ఎందుకంటే మల్లి స్టీమ్ చేస్తాం కాబట్టి.
ఇప్పుడు మైదా పిండిని, చిన్న నిమ్మకాయ సైజు లో ఉండలుగా చేసి. ఒక్కో పిండి భాగాన్ని సన్నగా చపాతి లాగా పిండి చల్లుతూ వత్తుకోవాలి. ఈ చపాతి సైజు సుమారు మన అర చెయ్యి సైజు లో సగం ఉంటె చాలు. దాంట్లో ఒక టేబుల్ స్పూన్ తయారు చేసి పెట్టుకున్న స్టెఫిన్గ్ పెట్టి, ఎడం చెయ్యి బొటన వేలి తో పిండికి సప్పోర్ట్ గా పెట్టి, కుడి చేత్తో చిన్న చిన్న కుచ్చులు గా చేస్తూ, బొటన వేలి దగ్గర వున్నా పిండి కి కలిపి, పై కవరింగ్ ని మూసెయ్యాలి. ఎడం చేతి లో మోమో ని పట్టుకుని కుడి చేత్తో క్లాక్ వైజ్ గా తిప్పుతూ దాన్ని పూర్తిగా క్లోజ్ చేయాలి. ఇలా అన్ని మోమోస్ తయారు చేసి పెట్టుకుని, స్టీమర్ ఉన్న వాళ్ళు, స్టీమర్ లో 15 -20 నిమిషాలు స్టీమ్ చేసి. తర్వాత వేడి వేడి గా రెడ్ గార్లిక్ చట్నీ తో తింటే బావుంటుంది. స్టీమర్ లేని వాళ్లు, ఒక వెడల్పాటి, లోతైన గిన్నెలో కానీ పాన్ లో కానీ 2 గ్లాసుల నీళ్లు పోసి, దాంట్లో స్టీల్ స్టాండ్ పెట్టి దాని పైన చిల్లుల చట్రం లో మోమోస్ పెట్టి, మూత పెట్టి 15 - 20 నిముషాలు స్టీమ్ చేసి రెడ్ గార్లిక్ చట్నీ కానీ ఇంకేదయినా ఇష్టమైన చట్నీ తో తినచ్చు. ఇవి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు, స్టీమ్ చెయ్యటం మూలాన ఆరోగ్యానికి చాలా మంచిది. మరి, మీ పిల్లలకి చేసి పెట్టేస్తారా ఈ హెల్తీ అండ్ టేస్టీ మోమోస్.
తాజా వార్తలు
- అమెరికాతో శాంతి చర్చలకు ముందు ఇరాన్ మరో రెండు కొత్త షరతులు..
- ఏప్రిల్ 14న దేశంలో తొలి క్వాంటం టెస్ట్ ఫెసిలిటీ ప్రారంభం
- 26 మందిని స్వదేశానికి రప్పించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశం
- ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్కు కొత్త దిశ
- ఇరాన్ దాడుల్లో గాయపడిన వారి చికిత్సపై అబూదాబి పోలీస్ చీఫ్ సమీక్ష
- యూపీలో ఘోర పడవ ప్రమాదం..10 మంది మృతి
- కేసీఆర్తో జీవన్ రెడ్డి భేటీ
- డ్రోన్ అటాక్స్ పై కువైట్ వార్నింగ్..!!
- ఖతార్లో భారత విదేశాంగ మంత్రి కీలక చర్చలు..
- సోహార్ లో భారీగా ఆల్కాహాల్ సీజ్..!!









