బ్రేక్ ఫాస్ట్ విత్ కాన్సుల్ జనరల్: ఉమ్ అల్ కువైన్‌లో భారత అసోసియేషన్ కార్యక్రమం

- August 21, 2021 , by Maagulf
బ్రేక్ ఫాస్ట్ విత్ కాన్సుల్ జనరల్: ఉమ్ అల్ కువైన్‌లో భారత అసోసియేషన్ కార్యక్రమం

యూఏఈ: ఐదవ ఎడిషన్ ‘బ్రేక్ ఫాస్ట్ విత్ కాన్సుల్ జనరల్’, కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా, దుబాయ్, కాన్సుల్ జనరల్ డాక్టర్ అమన్ పురి, ఉమ్ అల్ కువైన్‌లోని భారత అసోసియేషన్‌ని ఆగస్ట్ 20న సందర్శించారు. శరవణ ఫుడ్ స్టఫ్ ఫ్యాక్టరీ ఎల్ఎల్‌సికి చెందిన భారత వర్క్ ఫోర్స్‌తో సమావేశమయ్యారు. ఉమ్ అల్ కువైన్ భారత అసోసియేషన్ ప్రెసిడెంట్ సజాద్ సహీర్ నట్టిక, శరవణ ఫుడ్ స్టఫ్ ఫ్యాక్టరీ ఎల్ఎల్‌సి జనరల్ మేనేజర్ జుల్ఫికర్ అలి, దత్త యోగా సెంటర్ డాక్టర్ కె.ఎస్.ఎన్. కుమార్, బ్యాంక్ ఆఫ్ బరోడాకి చెందిన అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఫస్ట్ ఇండియన్ కమ్యూనిటీ వెల్ఫేర్ ఫండ్ డే కూడా ఇదే రోజున నిర్వహించారు. కార్మికులు బ్రేక్‌ఫాస్ట్‌లో పాల్గొనడం పట్ల, వారితో సమావేశమవడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు కాన్సుల్ జనరల్. కొత్త స్కిల్స్ నేర్చుకోవాలని వారికి సూచించారు. యోగా సాధన ద్వారా అనేక మానసిక శారీరక సమస్యలకు దూరంగా వుండొచ్చని కూడా పేర్కొన్నారు. ఇండియన్ అసోసియేషన్ ప్రతినిథులను, శరవణ ఫుడ్ స్టఫ్ ఫ్యాక్టరీ నిర్వాహకులను అభినందించారు. బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రతినిథులు, కార్మికులకు అవగాహనా సదస్సు నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమాలు, ర్యాఫిల్ డ్రాలు నిర్వహించి, విజేతలకు బహుమతులు అందించారు. కాన్సుల్ జనరల్, ఇండియన్ అసోసియేషన్ ఉమ్ అల్ కువైన్ ప్రాంగణంలో మొక్కను నాటారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com