ఒమాన్ వెదర్: మోటరిస్ట్లకి హెచ్చరిక

- June 04, 2015 , by Maagulf
ఒమాన్ వెదర్: మోటరిస్ట్లకి హెచ్చరిక

ది డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ మిటియరాలజీ అండ్‌ ఎయిర్‌ నావిగేషన్‌, మస్కట్‌లో విజిబులిటీ 3000 మీటర్లకు పడిపోయినట్లు తెలిపింది. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం రెండ్రోజులపాటు ఇదే పరిస్థితి కొనసాగనుంది. కొన్ని చోట్ల జల్లులు పడే అవకాశం ఉందనీ, ఈస్టర్న్‌ విండ్స్‌ కారణంగా ఇసుక గాల్లోకి లేచి, వాహనదారులకు ఇబ్బందులు కలగజేయనుందనే హెచ్చరికల్ని జారీ చేసింది వాతావరన శాఖ. మోటార్‌ వాహనాలపై వెళ్ళేవారు, ముఖ్యంగా టూవీలర్స్‌పై ప్రయాణించేవారు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఎడారులు, ఓపెన్‌ ఏరియాస్‌లో తిరిగేవారు ఇసుక గాలుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. సముద్రం తీర ప్రాంతంలో సేద తీరాలనుకునేవారు, ముఖ్యంగా టూరిస్టులు, సముద్రం రఫ్‌గా ఉంటుంది గనుక తగు జాత్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. 3 మీటర్ల వరకూ సముద్ర కెరటాలు ఎగసిపడే ప్రమాదం ఉంది.

 

--నూనె లెనిన్ కుమార్(ఒమాన్) 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com