మోడెర్నా వ్యాక్సిన్ భద్రతను ధృవీకరించిన ఎస్ఎఫ్‌డిఎ

- August 28, 2021 , by Maagulf
మోడెర్నా వ్యాక్సిన్ భద్రతను ధృవీకరించిన ఎస్ఎఫ్‌డిఎ

రియాద్: సౌదీ ఫుడ్ మరియు డ్రగ్స్ అథారిటీ (ఎస్ఎఫ్‌డిఎ), మోడెర్నా వ్యాక్సిన్ డోసులకు సంబంధించిన భద్రతను ధృవీకరించడం జరిగింది. అథరిటీ అధికార ప్రతినిథి తాయ్‌సెర్ అల్ ముఫార్రెజ్ మాట్లడాడుతూ, జపాన్‌లో రద్దు చేయబడిన బ్యాచ్ డోసుల వ్యవహారానికి, సౌదీ కింగ్‌డమ్ వచ్చిన బ్యాచ్ నెంబరుకీ తేడా వున్నట్లు పేర్కొన్నారు. ఎంఆర్ఎన్ఎ-1273 బ్యాచ్ వ్యాక్సిన్ పూర్తిగా సురక్షితమని తెలిపారు. ఫుడ్ మరియు డ్రగ్ అథారిటీ పలు పరీక్షలు నిర్వహించింది. అథారిటీ పలు శాంపిల్లను అన్ని షిప్‌మెంట్ల నుంచీ సేకరించి పరీక్షలు నిర్వహించడం జరుగుతోందని ఆయన వివరించారు. పూర్తి పరీక్షల తర్వాతే వినియోగానికి అనుమతినిచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగామోడెర్నా వ్యాక్సిన్‌ని జపాన్ సస్పెండ్ చేయడం జరిగింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com