ఈ వ్యాక్సిన్లు తీసుకున్నవారికి బూస్టర్ డోసులు అక్కర్లేదు - అబుధాబి
- August 29, 2021
అబుధాబి: సెప్టెంబర్ 20, 2021 నుండి అల్‌హోస్న్ యాప్ లో గ్రీన్ పాస్‌ను ఆక్టివేట్ చేసేందుకు ప్రజలు బూస్టర్ డోసులను తప్పనిసరిగా తీసుకొని ఉండాలి అని ఆగస్టు 14, 2021 న, ప్రకటించింది అబుధాబి అత్యవసర సంక్షోభం మరియు విపత్తుల కమిటీ. సూపర్ మార్కెట్లు మరియు ఫార్మసీలు మినహా అన్ని బహిరంగ ప్రదేశాలకు వెళ్లేందుకు అల్‌హోస్న్ యాప్ లో గ్రీన్ పాస్ తప్పనిసరి. అయితే, ఎవరు ఈ బూస్టర్ డోసులు తీసుకోవాలి అనేదానిపై ప్రజలలో కొన్ని సందేహాలు ఉండటంతో వాటికి సంధానం ఇచ్చింది అబుధాబి కమిటీ.
ఎవరికి బూస్టర్ డోసు అవసరమో, ఏ బూస్టర్ డోసు అవసరమో మరియు ఎప్పుడు బూస్టర్ డోసు తీసుకోవాలో ఇప్పడు చూద్దాం..
ఎవరికి బూస్టర్ డోసు అవసరం మరియు ఎప్పుడు అవసరం?
సినోఫార్మ్ వ్యాక్సిన్ రెండవ డోసు తీసుకొని ఆరు లేక అంతకంటే ఎక్కువ నెలలు అయ్యిఉంటే, వారు ఈ బూస్టర్ డోసులకు అర్హులు.
ఎవరికి బూస్టర్ డోసు అవసరం లేదు?
ఫైజర్, ఆస్ట్రాజెనెకా, స్పుత్నిక్ సహా ఇతర యూఏఈ ఆమోదించిన వ్యాక్సిన్ల రెండు డోసులను పొందిన వారికి ఆల్హోస్న్ గ్రీన్ పాస్ ఆక్టివేట్ కొరకు బూస్టర్ డోసు అవసరం లేదని కమిటీ ధృవీకరించింది. ఈ మినహాయింపు భవిష్యత్తులో UAE యొక్క ఆరోగ్య మంత్రిత్వ శాఖ (MOHAP) ద్వారా నవీకరించబడవచ్చు.
బూస్టర్ డోసులను పొందేందుకు గడువు ఏమిటి?
బూస్టర్ డోసులను పొందేందుకు గడువు సెప్టెంబర్ 20, 2021. కొత్త నివాసితులకు 60 రోజుల గ్రేస్ పీరియడ్ కూడా ప్రకటించబడింది.
ఏ బూస్టర్లు అందుబాటులో ఉన్నాయి? ఎలా బుక్ చేయాలి?
ఫైజర్ మరియు సినోఫార్మ్ బూస్టర్లు రెండూ అందుబాటులో ఉన్నాయి. అబుధాబి టెలిమెడిసిన్ సెంటర్ (ముబదల) గతంలో రెండు మోతాదుల సినోఫార్మ్ అందుకున్న వారికి ఫైజర్ తీసుకోవచ్చు అని క్లారిటీ ఇచ్చింది. కొన్ని ఆరోగ్య కేంద్రాలు వాక్-ఇన్ బూస్టర్లను అందిస్తున్నాయి.
బూస్టర్ దోషుల కొరకు SEHA నంబరు 80050 కు కాల్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. అలాగే, ముబదలతో అపాయింట్మెంట్ బుక్ చేసుకోదలచినవారు
8004959 నంబరుకు కాల్ చేయవచ్చు.
SEHA సెంటర్లు:
* అబుధాబి క్రూయిజ్ టెర్మినల్
* అబుధాబి సిటీ
* అల్ దఫ్రాలోని మదీనా జాయెద్ వెడ్డింగ్ హాల్
* అల్ ఐన్ సిటీ
* అల్ ఐన్ కన్వెన్షన్ సెంటర్
* దుబాయ్ పార్క్స్ & రిసార్ట్స్
బూస్టర్ డోసు తీసుకున్న తర్వాత గ్రీన్ పాస్ కు ఎంత సమయం పడుతుంది?
మీరు మీ బూస్టర్ షాట్ మరియు పిసిఆర్ పరీక్ష చేయించుకున్న వెంటనే మీ స్టేటస్ 'గ్రీన్' కు మారుతుంది. ఈ స్టేటస్ 30 రోజులు గ్రీన్ గా ఉంటుంది.
టూరిస్టులు ఈ బూస్టర్ డోసులు తీసుకోవచ్చా?
పర్యాటకులు ప్రస్తుతం యూఏఈ లో కోవిడ్ వ్యాక్సిన్లను స్వీకరించడానికి అర్హులు కారు.
Vaccinated individuals who received their second dose of Sinopharm vaccine more than six months ago must receive a booster dose to enhance their immunity and comply with approved health protocol for each vaccine. pic.twitter.com/3jobXGx6Wx
— مكتب أبوظبي الإعلامي (@admediaoffice) August 29, 2021
తాజా వార్తలు
- ఫిబ్రవరి 23న తెలంగాణ క్యాబినెట్ భేటీ
- నాలుగు రాష్ట్రాల ఎన్నికలు ఏప్రిల్లోనా? షెడ్యూల్ పై క్లారిటీ
- విశాఖకు చేరుకున్న రాష్ట్రపతి ముర్ము
- ఎర్రవల్లి ఫామ్ హౌస్ వద్ద కార్యకర్తల సందడి
- పేరుకే ఏఐ సమ్మిట్.. నో యూపీఐ, నో కార్డ్.. ఓన్లీ క్యాష్
- శ్రీసిటీలో క్యారియర్ ఏసీ తయారీ యూనిట్ ప్రారంభం
- కోర్టు తీర్పు పై స్పందించిన ప్రత్యూష తల్లి
- ప్రధానిగా తారిక్ రెహమాన్ ప్రమాణ స్వీకారం
- ఐబొమ్మ’ రవికి బెయిల్ మంజూరు
- బడ్జెట్ తర్వాత భారీగా పెరిగిన ‘సిగరెట్’ ధరలు









