షార్ట్ వేసుకొని మసీదులో ప్రార్ధన..ముయెజిన్ అరెస్ట్

- August 30, 2021 , by Maagulf
షార్ట్ వేసుకొని మసీదులో ప్రార్ధన..ముయెజిన్ అరెస్ట్

కువైట్: కువైట్లో ఓ ముయెజిన్ మసీదు పవిత్రకు భంగం కలిగించినందుకు అతన్ని అరెస్ట్ చేశారు. అల్-రెహాబ్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పబ్లిక్ ప్రాసిక్యూషన్ కు రిఫర్ చేసిన వివరాల ప్రకారం అల్-రెహాబ్ ప్రాంతంలోని అబ్దుల్లా బిన్ జాఫర్ మసీదులో ముయెజిన్ తెలుపు టీ షర్టు, షార్ట్‌లు ధరించి ప్రార్థన నిర్వహించాడు. అయితే..మసీదు సందర్శించిన ఓ వ్యాక్తి అతని వ్యవహారాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియో కాస్త వైరల్ గా మారటంతో దర్యాప్తు ప్రారంభించిన అధికారులు అతన్ని విధుల నుంచి తప్పించి అరెస్ట్ చేశారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com