యూఏఈ లోని నీట్ పరీక్షా కేంద్రాన్ని ప్రకటించిన NTA
- August 31, 2021
యూఏఈ: 'నేషనల్ ఎలిజిబిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్' నీట్ (UG) - 2021 పరీక్షకు పరీక్షా కేంద్రాన్ని దుబాయిలోని ఔద్ మెహ్త లో గల ఇండియన్ హై స్కూల్ (IHS) ను ఎంపికచేసినట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ప్రకటించింది. దీన్ని ధృవీకరిస్తూ దుబాయ్ లోని ఇండియన్ కాన్సులేట్ పరీక్షా విధానాన్ని, టైమింగ్స్ ను మీడియాకు తెలిపింది.
NEET (UG) -2021 అనేది MBBS/BDS/BAMS/BSMS/BUMS/BHMS మరియు ఇతర అండర్గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సులకు ఆమోదం/గుర్తింపు పొందిన మెడికల్/డెంటల్/ఆయుష్ మరియు భారతదేశంలోని ఇతర కళాశాలలు /డీమ్డ్ విశ్వవిద్యాలయాలు /సంస్థలు (AIIMS & JIPMER) కు రాసే నీట్ పరీక్ష NTA మార్గదర్శకాల ప్రకారం, భారతదేశం వెలుపల నిర్వహించేప్పుడు 'ఇంగ్లీష్' లో మాత్రమే విద్యార్థులు పరీక్ష రాయవలసి ఉంటుంది.
విద్యార్థులు గమనించదగ్గ సూచనలు:
1. పరీక్ష వేదిక: దుబాయిలోని ఔద్ మెహ్త లో గల ఇండియన్ హై స్కూల్ (IHS)
2. ఫోన్ నంబరు: 04-3377475
3. పరీక్ష తేదీ/వేళలు: 12 సెప్టెంబర్ 2021 ఆదివారం; మధ్యాహ్నం 12:30 నుండి - 03:30 గం. వరకు (UAE కాలమానం) నిర్వహించబడుతుంది. పరీక్ష వ్యవధి మూడు (03) గంటలు.
4. పరీక్ష విధానం: NTA మార్గదర్శకాల ప్రకారం పెన్ మరియు పేపర్ మోడ్ లో పరీక్ష జరుగుతుంది. బ్లాక్ బాల్ పాయింట్ పెన్ను ఉపయోగించి ప్రత్యేకంగా రూపొందించిన మెషిన్ గ్రేడబుల్ OMR షీట్‌లో సమాధానం ఇవ్వాలి.
5. పరీక్ష కేంద్రానికి ప్రవేశ నియమాలు: IHS లో అభ్యర్థుల ప్రవేశం గేట్స్ నెం. 4, 5, మరియు 6 (సెయింట్ మేరీస్ క్రచ్, ఔద్ మెహ్త రోడ్) ద్వారా పరీక్షా కేంద్రానికి చేరుకోవచ్చు. అభ్యర్థులు సంబంధిత అడ్మిట్ కార్డులలో సూచించిన సమయం ప్రకారం IHS గేట్స్ వద్ద రిపోర్ట్ చేయవలసి ఉంటుంది.
12.00 గంటల (UAE సమయం) తర్వాత అభ్యర్థులు ఎవరూ IHS లో ప్రవేశించడానికి అనుమతించబడరు. అందువల్ల, అభ్యర్థులు ట్రాఫిక్, కేంద్రం ఉన్న ప్రదేశం మరియు వాతావరణ పరిస్థితులు మొదలైనవాటిని పరిగణనలోకి తీసుకుని ముందస్తుగా ఇంటి నుండి బయలుదేరాలి అధికారులు సూచించారు.
6. అడ్మిట్ కార్డ్: అభ్యర్థులు NTA వెబ్‌సైట్ “https://neet.nta.nic.in” నుండి అడ్మిట్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవాలి. అభ్యర్థులు NTA వెబ్‌సైట్‌తో పాటు అడ్మిట్ కార్డులో ఇచ్చిన సూచనలను జాగ్రత్తగా చదవాలని మరియు పరీక్ష నిర్వహణ సమయంలో వాటిని జాగ్రత్తగా పాటించాలని సూచించారు.
7. ఈ క్రింది వాటిని మాత్రమే పరీక్ష కేంద్రానికి అనుమతిస్తారు:
* పాస్‌పోర్ట్ సైజు ఫోటో అంటించిన అడ్మిట్ కార్డు.
* అటెండన్స్ షీట్ లో అంటించేందుకు ఒక పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో
* ఒరిజినల్ ఐడెంటిటీ ప్రూఫ్ (PwD సర్టిఫికేట్)
* అడ్మిట్ కార్డ్‌తో డౌన్‌లోడ్ చేసిన ప్రొఫార్మాలో వైట్ బాక్గ్రౌండ్ ఉన్న ఒక పోస్ట్ కార్డ్ సైజు (4 ”X6”) కలర్ ఫోటోను అతికించి, కేంద్రంలోని ఇన్విజిలేటర్‌కు అందజేయాలి.
గమనిక: పరీక్ష హాల్‌లో ప్రవేశానికి అభ్యర్థి తప్పనిసరిగా అడ్మిట్ కార్డును చూపించాలి. చెల్లుబాటు అయ్యే అడ్మిట్ కార్డు లేని అభ్యర్థిని సెంటర్ సూపరింటెండెంట్ పరీక్ష హాల్లోకి అనుమతించరు. పోస్ట్‌కార్డ్ సైజు (4 ”X6”) ఫోటో అతికించిన మరియు ఒక పాస్‌పోర్ట్ సైజు ఫోటోతో డౌన్‌లోడ్ చేసిన ప్రొఫార్మాను తీసుకురాని అభ్యర్థి పరీక్ష రాసేందుకు అనుమతింపబడరు.
8. యూఏఈ ప్రభుత్వ కోవిడ్ -19 ఆరోగ్య నిబంధనలను అనుసరించి పరీక్ష నిర్వహిస్తారు. కావున, అభ్యర్థులు అత్యంత సున్నితమైన మెటల్ డిటెక్టర్ల సహాయంతో పరీక్షా కేంద్రంలోకి ప్రవేశించే ముందు విస్తృతమైన, నిర్బంధమైన ఫ్రిస్కింగ్ మరియు ఉష్ణోగ్రత తనిఖీకి లోనవుతారు.
9. అభ్యర్థులు మరియు వారి తల్లిదండ్రులు పరీక్షకు ముందు మరియు తరువాత NTA ఇచ్చిన పూర్తి మార్గదర్శకాల కోసం దిగువ పేర్కొన్న లింక్‌ని https://neet.nta.nic.in/webinfo/File/GetFile?FileId=83&LangId=P సందర్శించాలని సూచించారు. అలాగే, రెగ్యులర్ అప్‌డేట్‌ల కొరకు తల్లిదండ్రులు మరియు అభ్యర్థులు NTA వెబ్‌సైట్ (లు) www.nta.ac.in మరియు https://neet.nta.nic.in/ ని సందర్శించాలని అధికారులు కోరారు.
గమనిక: IHS లో పార్కింగ్ సౌకర్యాలు లేవు. లిమిటెడ్ పబ్లిక్ పార్కింగ్ ఉన్నందున కేంద్రం వద్ద అభ్యర్థులు 'పిక్-అండ్-డ్రాప్' ను అనుసరించాలని సూచించారు.
తాజా వార్తలు
- వాహనాలను ఢీకొన్న ట్రక్కు..8 మంది సజీవ దహనం
- సౌతాఫ్రికా పై భారత్-ఏ ఘన విజయం
- వాహనాలపై జెండాలు..పోలీసుల హెచ్చరికలు..!!
- డిసెంబర్ చివరిలో కువైట్ జియోపార్క్ ప్రారంభం..!!
- GCC ‘వన్-స్టాప్’ ప్రయాణానికి బహ్రెయిన్ మొదటి కేంద్రం..!!
- సౌదీ అరేబియాలో రీసెర్చ్ పై SR29.48 బిలియన్లు ఖర్చు..!!
- యూఏఈ లాటరీలో ప్రతి టికెట్‌కీ 100 మిలియన్ డాలర్ల విజయం..!!
- దృష్టి లోపం ఉన్నవారికి ఖతార్ శుభవార్త..బ్రెయిలీలో మెడిసిన్ వివరాలు..!!
- హైదరాబాద్‌లో హై అలర్ట్
- CII సదస్సుకు సర్వం సిద్ధం..







