ఏపీ కరోనా అప్డేట్
- August 31, 2021
అమరావతి: ఏపీలో మరోసారి కరోనా కేసులు పెరిగాయి.తాజాగా రాష్ట్రంలో 52,319 శాంపిల్స్‌ను టెస్ట్ చేయగా 1115 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 20,14,116కి చేరింది.ఇందులో 19,85,566 మంది ఇప్పటికే కోలుకొని డిశ్చార్జ్ కాగా, 14,693 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి.ఇక గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనాతో 19 మంది మృతి చెందారు.దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనాతో 13,857 మంది మృతి చెందారు.గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనా నుంచి 1265 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. కరోనా మహమ్మారి నుంచి బయటపడాలి అంటే వ్యాక్సిన్ తీసుకోవడం ఒక్కటే మార్గం కావడంతో వేగంగా వ్యాక్సిన్‌ను అమలు చేస్తున్నారు.వ్యాక్సినేషన్ అమలు చేస్తున్నా కేసులు పెరుగుతుండడంతో తప్పని సరిగా నిబంధనలు పాటించాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తున్నది. ఇక ఇదిలా ఉంటే, చిత్తూరులో 210, గుంటూరులో 121, కృష్ణాలో 165, నెల్లూరులో 120, ప్రకాశంలో 121, పశ్చిమ గోదావరి జిల్లాలో 125 కేసులు నమోదయ్యాయి.
తాజా వార్తలు
- కువైట్ లో ఎయిర్ లైన్ సహా 8 ట్రావెల్ ఆఫీసులకు ఫైన్స్..!!
- మీడియాలో అభ్యంతరకర ప్రకటనలు..వ్యక్తి అరెస్టు..!!
- ఒమన్ లో సాంస్కృతిక వీసా..ఎవరికిస్తారంటే?
- మీ బ్యాంక్ వెబ్సైట్ అడ్రస్ మారింది.. ఇకపై .com, .co.in ఉండవు
- విశాఖపట్నం కంటే ముందే ఏపి కి భారీ పెట్టుబడులు
- AI చాట్‌బాట్ ద్వారా క్షణాల్లో టిటిడి సకల సమాచారం
- వాహనాలను ఢీకొన్న ట్రక్కు..8 మంది సజీవ దహనం
- సౌతాఫ్రికా పై భారత్-ఏ ఘన విజయం
- వాహనాలపై జెండాలు..పోలీసుల హెచ్చరికలు..!!
- డిసెంబర్ చివరిలో కువైట్ జియోపార్క్ ప్రారంభం..!!







