ఒమర్‌ అల్‌ శిశానీ మృతి

- March 15, 2016 , by Maagulf
ఒమర్‌ అల్‌ శిశానీ మృతి

ఇస్లామిక్‌ స్టేట్‌ (ఐసిస్‌) ఉగ్రవాద సంస్థ అగ్రనేత 'ఒమర్‌ ది చెచెన్‌గా గుర్తింపు పొందిన ఒమర్‌ అల్‌ శిశానీ మృతిచెందినట్టు పెంటగాన్‌ ప్రకటించింది. ఈశాన్య సిరియా భాగంలో ఉగ్రవాద సంస్థల స్థావరాలపై అమెరికా నేతృత్వంలో జరిపిన దాడుల్లో తీవ్రంగా గాయపడిన శిశానీ మృతిచెందాడని తాము విశ్వసిస్తున్నామని పెంటగాన్‌ అధికార ప్రతినిధి నేవీ కెప్టెన్‌ జెఫ్‌ డేవిస్‌ అన్నారు. చాలా రోజుల క్రితమే శివానీ వైద్యపరంగా మృతిచెందిన శిశానీ ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికపుడు పర్యవేక్షిస్తున్న సిరిమాలోని మానవహక్కుల పరిశీలక బృందం పేరక్కొంది. ఇదిలా ఉండగా శిశానీని మోస్ట్‌ వాంటెడ్‌ టెర్రిస్టుగా వాషింగ్టన్‌ ప్రకటించింది.అంతేకాకుండా అతని తలపై 5 మిలియన్‌ అమెరికన్‌ డాలర్ల బహుమతి ప్రకటించిన విషయం విదితమే..

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com