ఒమన్‌లో ఈ ఏడాది జీతాల పెరుగుదల ఇలా

- March 15, 2016 , by Maagulf
ఒమన్‌లో ఈ ఏడాది జీతాల పెరుగుదల ఇలా

ఒమన్‌ మరియు జిసిసి దేశాల్లో ఈ ఏడాది జీతాల పెరుగుదల గడచిన పదేళ్ళతో పోల్చితే తక్కువే ఉండవచ్చునని అంచనా వేస్తున్నారు. యూఏఈలో ఒపొఫెషనల్స్‌ 5.3 శాతం పెరుగుదల నమోదు చేసే అవకాశం ఉంది. ఖతార్‌ 4.7 శాతంతోనూ, కువైట్‌, ఒమన్‌లలో 4.6, 4.4 శాతం పెరుగుదల ఉండవచ్చు. అయితే, ఖర్చులు రెండింతలు పెరగడంతో సేలరీ ఇంక్రీజ్‌ అనేది చాలా తక్కువగా ఉండటం పట్ల ప్రొఫెషనల్స్‌ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయంగా ముడిచమురు ధరల సంక్షోభంతో గల్ఫ్‌ దేశాల్లో సబ్సిడీలు ఎత్తివేయడం సామాన్యులపై తీవ్ర ప్రభావం చూపింది. గల్ఫ్‌ వ్యాప్తంగా 700 మంది యజమానులు, 25,000 మంది ప్రొఫెషనల్స్‌ని సర్వే చేసి, పరిస్థితుల్ని అంచనా వేశారు. ఈ అంచనాల ప్రకారం 2016లో సేలరీ ఇంక్రీజ్‌ అనేది 5.2 వరకూ ఉండొచ్చని అంచనా వేయడం జరిగింది. పరిస్థితులు ఇబ్బందికరంగా ఉన్నా, ముడిచమురుపై ఆధారపడ్డ ఇతర దేశాలతో పోల్చితే గల్ఫ్‌ దేశాల్లో పరిస్థితులు మెరుగ్గా ఉన్నాయని నిపుణులు చెప్పారు. కంపెనీలు పెరుగుతున్నా, వాటిల్లో ఉద్యోగుల సంఖ్య తగ్గిపోతుండడానికి కారణం ఈ సంక్షోభమే. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com