మెంటల్ హెల్త్‌కేర్‌ని ప్రారంభించిన పీఎం
- March 15, 2016
కమ్యూనిటీ బేస్డ్ మెంటల్ హెల్త్ సెంటర్‌ని ప్రైమ్ మినిస్టర్ మరియు ఇంటీరియర్ మినిస్టర్ అబ్దుల్లా బిన్ నాజర్ బిన్ ఖలీఫా అల్ థని ప్రారంభించారు. హమాద్ మెడికల్ కార్పొరేషన్ (హెచ్‌ఎంసి) ఈ సెంటర్‌ని ఏర్పాటు చేసింది. పిల్లలకు సైకలాజికల్ సపోర్ట్‌ని మరియు హెల్త్ కేర్‌ని అందించేలా ఈ విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో మహిళలకు డే కేర్ ప్రోగ్రామ్‌ని ప్రత్యేకించి 18 ఏళ్ళు దాటిన మహిళల కోసం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విభాగంలో పూర్తిగా మహిళలే పనిచేయనున్నారు. మానసిక రుగ్మతలు సమాజంలో ఎక్కువవుతుండడంతో, అలాంటివారికి చికిత్స అందించేందుకు ఇలాంటి చికిత్సనందించే హాస్పిటల్స్ మరిన్ని రావాలని ప్రైమ్ మినిస్టర్ ఆకాంక్షించారు. మానసిక సమస్యలకు చికిత్సను అందించడమే కాకుండా, మానసిక సమస్యల్ని ముందస్తుగా గుర్తించి, నివారించేందుకూ తగిన విధంగా పలు ఏర్పాట్లు ఈ ఆసుపత్రిలో ఉన్నాయని హమాద్ మెడికల్ కార్పొరేషన్ వర్గాలు వెల్లడించాయి.
తాజా వార్తలు
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!







