మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ లో ఉద్యోగావకాశాలు
- September 03, 2021
బెంగళూరు: ప్రభుత్వ ఉద్యోగం కోసం చూస్తున్న నిరుద్యోగులకు సువర్ణావకాశం. పదో తరగతి అర్హతతో కేంద్ర రక్షణ శాఖలో ఉద్యోగం సంపాదించవచ్చు.బెంగళూరులోని ఏఎస్‌సీ సెంటర్ సౌత్ కోసం దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 400 పోస్టులను భర్తీ చేయనుంది. ఇందులో సివిల్ మోటార్ డ్రైవర్, క్లీనర్, కుక్, సివిలియన్ కేటరింగ్ ఇన్‌స్ట్రక్టర్, లేబర్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ లాంటి పోస్టులున్నాయి. వీటికి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఆసక్తి గల అభ్యర్థులు పోస్టు ద్వారా దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. సెప్టెంబర్ 17 దరఖాస్తులకు చివరి తేదీ. దరఖాస్తు ఫామ్ కూడా అధికారిక నోటిఫికేషన్‌లోనే ఉంటుంది. మొత్తం ఖాళీలు 400గా నిర్ణయించారు. అందులో సివిల్ మోటార్ డ్రైవర్ (పురుషులు మాత్రమే)- 115, క్లీనర్- 67, కుక్- 15, సివిలియన్ కేటరింగ్ ఇన్‌స్ట్రక్టర్- 3, లేబర్ (పురుషులు మాత్రమే)- 193, మల్టీ టాస్కింగ్ స్టాఫ్- 7 పోస్టులు ఉన్నాయి.
వివరాలు...
1. విద్యార్హతలు: సివిల్ మోటార్ డ్రైవర్ పోస్టులకు టెన్త్ క్లాస్ పాస్ కావాలి. హెవీ, లైట్ మోటార్ వెహికిల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. డ్రైవింగ్‌లో రెండేళ్ల అనుభవం ఉండాలి. మోటార్ మెకానిజం తెలిసి ఉండాలి. పురుషులు మాత్రమే అప్లయ్ చేయాలి.
2. క్లీనర్: టెన్త్ పాస్ కావాలి.
3. కుక్: టెన్త్ పాస్ కావాలి. కుకింగ్‌లో అనుభవం ఉండాలి.
4. సివిలియన్ కేటరింగ్ ఇన్‌స్ట్రక్టర్: టెన్త్ పాస్ కావాలి. కేటరింగ్‌లో డిప్లొమా లేదా సర్టిఫికెట్ కోర్స్ పాస్ కావాలి. కేటరింగ్ ఇన్‌స్ట్రక్టర్‌గా ఏడాది పనిచేసిన అనుభవం ఉండాలి.
5. లేబర్: టెన్త్ పాస్ కావాలి. పురుషులు మాత్రమే అప్లయ్ చేయాలి.
6. మల్టీ టాస్కింగ్ స్టాఫ్: టెన్త్ పాస్ కావాలి.
ఎంపిక విధానం: రాతపరీక్షతో పాటు స్కిల్ టెస్ట్, ఫిజికల్ టెస్ట్, ప్రాక్టికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
వేతనం: సివిల్ మోటార్ డ్రైవర్, క్లీనర్, కుక్, సివిలియన్ కేటరింగ్ ఇన్‌స్ట్రక్టర్ పోస్టులకు రూ.19,900 + డీఏ, లేబర్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకు రూ.18,000 + డీఏ ఉంటుంది.
దరఖాస్తులు ప్రారంభం: ఆగస్ట్ 28, 2021
దరఖాస్తులకు చివరి తేదీ: సెప్టెంబర్ 17, 2021
తాజా వార్తలు
- కువైట్‌లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!
- ప్రాంతీయ భద్రత అంశంలో భారత్‌కు బహ్రెయిన్ కృతజ్ఞతలు..!!
- మసీర్హా పోర్టులో అగ్నిప్రమాదం.. వేగంగా స్పందించిన ఫైర్ ఫైటర్స్..!!
- నకిలీ వస్తువుల కొనుగోలుపై యూఏఈ హెచ్చరిక..రూ.2.3 కోట్ల వరకు జరిమానా, జైలు శిక్ష..!!
- ఖతార్‌లో చక్కెర కలిపిన పానీయాలపై ఎక్సైజ్ పన్ను అమలు..!!
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్‌లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..







