కువైట్ కు డైరెక్ట్ ఫ్లైట్స్ పై ఇంకా స్పష్టత ఇవ్వని భారత్
- September 04, 2021
కువైట్ సిటీ: కువైట్ కు డైరెక్ట్ ఫ్లైట్స్ పై భారత పౌర విమానయాన మంత్రిత్వ శాఖ నుంచి స్పష్టత రాకపోవటంతో ప్రయాణికుల్లో ఆందోళన నెలకొంది. ఇండియా నుంచి వారానికి 5528 సీట్లను కేటాయిస్తూ కువైట్ మంత్రివర్గం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. రోజుల వారీగా సీట్ల కోటాపై విమాన సంస్థలకు లిస్ట్ కూడా విడుదల చేసింది. అయితే..భారత పౌర విమానయాన శాఖ మాత్రం కువైట్ కు డైరెక్ట్ ఫ్లైట్లు పున:ప్రారంభించే అంశంపై ఇంకా ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదు. కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు ఇండియా డైరెక్ట్ ఫ్లైట్స్ పునరుద్ధరణపై సంబంధిత అధికారుల నుంచి అనుమతి కోసం ఎదురుచూస్తున్నామని, బహుశా వచ్చే వారానికి అనుమతులు వస్తుండొచ్చని కువైట్ అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే..భారత్ సివిల్ ఏవియేషన్ నిర్ణయం ఎలా ఉన్నా తమకు నిర్దేశించిన సీట్ల
మేరకు ఈ ఆదివారం నుంచి ఇండియాకు డైరెక్ట్ ఫ్లైట్స్ సర్వీసులను నడపనున్నట్లు కువైట్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ తెలిపారు. ఇదిలాఉంటే..కువైట్ కు డైరెక్ట్ ఫ్లైట్స్ పై భారత నిర్ణయం ఆలస్యం అవుతుండటం..వన్ వే రిటర్న్ టిక్కెట్ల ఛార్జీల రేట్లు అమాంతంగా పెరిగిపోవటం ప్రయాణికులు, ట్రావెల్ ఏజెంట్లను ఆందోళనకు గురి చేస్తోంది.
తాజా వార్తలు
- అదనపు ఛార్జీలపై ఇండియన్ ఎంబసీ క్లారిటీ..!!
- ఖతార్ లో ఆకట్టుకుంటున్న త్రోబ్యాక్ ఫుడ్ ఫెస్టివల్..!!
- డీప్‌ఫేక్ ఆఫెన్స్ ప్రపొజల్.. అధ్యయనానికి సిఫార్సు..!!
- అత్యవసర విదేశాంగ మంత్రివర్గ సమావేశానికి OIC పిలుపు..!!
- యూఏఈలో ఈద్ అల్ ఫితర్ సెలవులు.. డేట్స్ అనౌన్స్..!!
- కువైట్ లో మేజర్ సెక్యూరిటీ డ్రైవ్..!!
- ప్రధాని పై ఉదయనిధి స్టాలిన్ వివాదాస్పద వ్యాఖ్యలు
- తేజస్ జెట్ ప్రమాదం పై ఎయిర్ ఫోర్స్ దర్యాప్తు ప్రారంభం
- TANA అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం
- కువైట్ సార్వభౌమత్వానికి యూఏఈ మద్దతు..!!









