ఒమన్‌లో ఈ ఏడాది జీతాల పెరుగుదల ఇలా
- March 15, 2016
ఒమన్ మరియు జిసిసి దేశాల్లో ఈ ఏడాది జీతాల పెరుగుదల గడచిన పదేళ్ళతో పోల్చితే తక్కువే ఉండవచ్చునని అంచనా వేస్తున్నారు. యూఏఈలో ఒపొఫెషనల్స్ 5.3 శాతం పెరుగుదల నమోదు చేసే అవకాశం ఉంది. ఖతార్ 4.7 శాతంతోనూ, కువైట్, ఒమన్లలో 4.6, 4.4 శాతం పెరుగుదల ఉండవచ్చు. అయితే, ఖర్చులు రెండింతలు పెరగడంతో సేలరీ ఇంక్రీజ్ అనేది చాలా తక్కువగా ఉండటం పట్ల ప్రొఫెషనల్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయంగా ముడిచమురు ధరల సంక్షోభంతో గల్ఫ్ దేశాల్లో సబ్సిడీలు ఎత్తివేయడం సామాన్యులపై తీవ్ర ప్రభావం చూపింది. గల్ఫ్ వ్యాప్తంగా 700 మంది యజమానులు, 25,000 మంది ప్రొఫెషనల్స్‌ని సర్వే చేసి, పరిస్థితుల్ని అంచనా వేశారు. ఈ అంచనాల ప్రకారం 2016లో సేలరీ ఇంక్రీజ్ అనేది 5.2 వరకూ ఉండొచ్చని అంచనా వేయడం జరిగింది. పరిస్థితులు ఇబ్బందికరంగా ఉన్నా, ముడిచమురుపై ఆధారపడ్డ ఇతర దేశాలతో పోల్చితే గల్ఫ్ దేశాల్లో పరిస్థితులు మెరుగ్గా ఉన్నాయని నిపుణులు చెప్పారు. కంపెనీలు పెరుగుతున్నా, వాటిల్లో ఉద్యోగుల సంఖ్య తగ్గిపోతుండడానికి కారణం ఈ సంక్షోభమే.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







