హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్‌ పట్టివేత..

- September 04, 2021 , by Maagulf
హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్‌ పట్టివేత..

హైదరాబాద్: హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్‌ భారీగా పట్టుబడ్డాయి. బంజారాహిల్స్‌లో నిర్వహించిన సోదాల్లో భారీగా మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. అక్రమంగా డ్రగ్స్‌ను సరఫరా చేస్తున్నారనే సమాచారంతో ఎక్సైజ్‌ ఎన్స్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు బంజారాహిల్స్‌లో దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో డ్రగ్స్‌తోపాటు.. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. నిందితుల నుంచి 30 గ్రాముల ఎండీఎంఏ, 4 బోల్ట్స్ ఎల్‌ఎస్డీ, 50 గ్రాముల ఛరాస్, 10 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

నిందితులను హైదరాబాద్‌కు చెందిన మద్ది శివశంకర్ రెడ్డి, గంధం మణికాంత్, డార్జిలింగ్‌కు చెందిన శిల్పానుగా గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. వారి నుంచి డ్రగ్స్‌తోపాటు.. రెండు బైకులు, నాలుగు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. మహిళను డ్రగ్స్‌తో గోవాకు పంపిస్తుండగా అరెస్టు చేసినట్లు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ డ్రగ్స్‌ సరఫరా వెనుక ఉన్న కీలక వ్యక్తుల కోసం విచారణ నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఈ ఘటనకు ముందు హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో డ్రగ్స్ స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే.. తాజాగా భారీగా డ్రగ్స్ పట్టుబడటంతో హైదరాబాద్ లో ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com