అబుధాబి వెళ్లేవారికి మార్గదర్శకాలు...

- September 05, 2021 , by Maagulf
అబుధాబి వెళ్లేవారికి మార్గదర్శకాలు...

అబుధాబి: అబుధాబి వెళ్లే వారికి నేటి నుంచి కొత్త మార్గదర్శకాలు అమలు కానున్నాయి. ముఖ్యంగా క్వారంటైన్, పీసీఆర్ టెస్టు, ప్రయాణికులు వచ్చే దేశాలు తదితర విషయాల ఆధారంగా కొత్త గైడ్‌లైన్స్ రూపొందించడం జరిగింది. ఇక ఇవాళ్టి నుంచి వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్న ప్రయాణికులతో పాటు గ్రీన్ లిస్ట్ దేశాల నుంచి వచ్చేవారికి ఎలాంటి క్వారంటైన్ ఉండదని ఇప్పటికే అబుధాబి అధికారులు ప్రకటించారు. అబుధాబి వెళ్లే వారికి ఇతర మార్గదర్శకాల పూర్తి వివరాలు...

వ్యాక్సినేషన్ పూర్తైనవారు  గ్రీన్ లిస్ట్ దేశాల నుంచి వెళ్తే వారికి ఎలాంటి క్వారంటైన్ ఉండదు. అరైవల్ డేతో పాటు ఆరో రోజున పీసీఆర్ టెస్టు ఉంటుంది. అలాగే వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్న ప్రయాణికులు గ్రీన్ లిస్ట్ దేశాల నుంచి కాకుండా ఇతర దేశాల నుంచి వస్తే.. వారికి కూడా క్వారంటైన్ ఉండదు. అరైవల్ డేతో పాటు నాల్గో, ఎనిమిదో రోజున పీసీఆర్ టెస్టు ఉంటుంది. ఇక వ్యాక్సిన్ తీసుకోని వారు గ్రీన్ లిస్ట్ దేశాల నుంచి వెళ్తే వారికి కూడా ఎలాంటి క్వారంటైన్ ఉండదు. అరైవల్ డేతో పాటు ఆరో, తొమ్మిదో రోజున పీసీఆర్ టెస్టు చేయించుకోవాలి. అలాగే వ్యాక్సిన్ తీసుకోని ప్రయాణికులు గ్రీన్ లిస్ట్ దేశాల నుంచి కాకుండా ఇతర దేశాల నుంచి వస్తే.. వారికి 10రోజుల క్వారంటైన్ ఉంటుంది. అరైవల్ డేతో పాటు తొమ్మిదో రోజున పీసీఆర్ పరీక్ష ఉంటుంది. 

కాగా, వ్యాక్సిన్ తీసుకోని, హైరిస్క్ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు 10 రోజుల పాటు ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రాల్లో ఉండాల్సి ఉంటుంది. అలాగే చేతికి మెడికల్ రిస్ట్‌బ్యాండ్ ధరించాల్సి ఉంటుంది. ఇక అబుధాబి వచ్చే ప్రయాణికులందరూ పీసీఆర్ నెగెటివ్ సర్టిఫికేట్ చూపించడం తప్పనిసరి.

--ప్రదీప్(మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com