రోడ్డు భద్రతపై సౌదీ అరేబియాలో కొత్త సెంటర్ ప్రారంభం
- September 06, 2021
రియాద్: రోడ్డు భద్రతను మరింత పెంచేలా ఓ కొత్త కేంద్రాన్ని సౌదీ అరేబియా ప్రారంభించింది. సెంటర్ ఆఫ్ ఎపిడిమాలజీ ఆఫ్ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్, రోడ్డు ప్రమాదాల్ని తగ్గించేలా తీసుకోవాల్సిన తగు చర్యల్ని అధ్యయనం చేస్తోంది. సౌదీ రెడ్ క్రిసెంట్ అధారిటీ ప్రెసిడెంట్ డాక్టర్ జలాల్ బిన్ మొహమ్మద్ అల్ ఒవైసీ మాట్లాడుతూ, 2025 నాటికి రోడ్డు ప్రమాదాలపై మానిటరింగ్ మరియు గాయాలపై రీసెర్చ్ వంటి విభాగాలలో తమ సంస్థ రీజినల్ లీడర్ అవుతుందని అన్నారు. సెంటర్ డైరెక్టర్ యూసెఫ్ అల్ సఫియాన్ మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాలకు సంబంధించి డేటాను విశ్లేషించడానికి నిపుణుల్ని వినియోగిస్తున్నట్లు చెప్పారు. ప్రమాదాల్ని తగ్గించడానికి ప్రజల నుంచి సలహాలు తీసుకోవడం, అదే విధంగా వారిని చైతన్య వంతుల్ని చేయడం ఈ సెంటర్ లక్ష్యం.
తాజా వార్తలు
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల
- డ్రగ్స్ కేసుల్లో చిక్కుకున్న విదేశీయులను వెనక్కి పంపనున్న కేంద్రం
- టీటీడీ ఈవోకు శుభాకాంక్షలు తెలిపిన టిటిడి పాలక మండలి