ఆ స్టార్ పుట్టినరోజుకు 70 మంది అభిమానులకు ఉచితంగా దుబాయ్ టూరిస్ట్ వీసాలు
- September 07, 2021
యూఏఈ: దుబాయ్‌కి చెందిన ఓ ట్రావెల్ ఏజెన్సీ, మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి పుట్టినరోజు నేపథ్యంలో అరుదైన కార్యక్రమం చేపట్టింది. మమ్ముట్టి 70వ ఏట అడుగు పెట్టిన నేపథ్యంలో, 70 మంది మమ్ముట్టి అభిమానులకు ఉచిత టూరిస్ట్ వీసాలను జారీ చేయనుంది. ఒక నెల ఫ్రీ ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కూడా ఇందులో వుంటుందని స్మార్ట్ ట్రావెల్స్ డైరెక్టర్ అఫి అహ్మద్ వెల్లడించారు. తాను మమ్ముట్టీకి వీరాభిమానిననీ, నలభయ్యేళ్ళుగా ఆయన అభిమానిగా కొనసాగుతున్నానని చెప్పారాయన. ముందుగా రిజిస్టర్ చేసుకున్నవారికి ముందుగా.. అనే ప్రాతిపదికన ఈ ఉచిత వీసాలను అందిస్తారు. సెప్టెంబర్ 8 బుధవారం సాయంత్రం 5 గంటల లోపు దరఖాస్తు చేసుకోవాలి.
తాజా వార్తలు
- తెలంగాణ వ్యాప్తంగా 33 జిల్లాల్లో ప్రయాణం ప్రారంభించిన స్పోర్ట్స్ హ్యాకథాన్ టార్చ్
- కీలక మ్యాచ్‌లో విండీస్‌పై భారత్ ఘన విజయం..
- ఖతార్ రక్షణ మంత్రి నుంచి షేక్ హమ్దాన్కు ఫోన్ కాల్
- కువైట్ రక్షణ మంత్రి నుంచి షేఖ్ హమ్దాన్కు ఫోన్ కాల్
- యూఏఈ ప్రైవేట్ రంగానికి అడ్వైజరీ
- అమరావతిలో 'న్యాయ' మణిహారం: రాజధాని ప్రస్థానంలో మరో మైలురాయి!
- ఇరాన్, గల్ఫ్ దేశాల్లో ఉన్న తెలుగు వారు అప్రమత్తంగా ఉండాలి: సీఎం రేవంత్
- భారీ నిరసనలు..శ్రీనగర్‌లో ఇంటర్నెట్ సేవల నిలిపివేత
- ఇరాన్ తాత్కాలిక సుప్రీం లీడర్‌గా అలిరెజా అరాఫీ నియామకం
- ఇరాన్ నుంచి ప్రయోగించిన క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న ఖతార్ రక్షణ మంత్రిత్వ శాఖ









