సమస్యలు ఉంటే సంప్రదించండి :సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర

- September 09, 2021 , by Maagulf
సమస్యలు ఉంటే సంప్రదించండి :సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర

హైదరాబాద్: పోలీసులకు సమస్యలు ఉంటే తనను సంప్రదించాలని సైబరాబాద్ పోలీస్ కమీషనర్ ఎం.స్టేఫెన్ రవీంద్ర అన్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ లోని మెయిన్ కాన్ఫరెన్స్ హాల్లో ఈరోజు కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్లు, అసిస్టెంట్ సబ్ ఇన్ స్పెక్టర్లతో సైబరాబాద్ సీపీ సమావేశమయ్యారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పని చేస్తున్న అన్ని పోలీస్ స్టేషన్లకు చెందిన 200 మంది లా అండ్ ఆర్డర్ పోలీసులు, ఎస్బీ, ట్రాఫిక్, సైబర్ క్రైమ్స్, సీసీఆర్బీ, షీ టీమ్స్ తదితర విభగాలకు చెందిన కానిస్టేబుళ్లు,హెడ్ కానిస్టేబుళ్లు, అసిస్టెంట్ సబ్ ఇన్ స్పెక్టర్లతో సిబ్బంది తో సీపీ సమావేశమయ్యారు.  


 
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ తాను పోలీస్ కుటుంబం నుంచి వచ్చానని పోలీసుల కష్టాలు బాధలు తనకు బాగా తెలుసునన్నారు. అనంతరం సీపీ సిబ్బందిని అడిగి వారి యోగక్షేమాలను తెలుసుకున్నారు. నేరుగా వారితో మాట్లాడి వారి సాధకబాధలు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సిబ్బందికి ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తామని అన్నారు. సిబ్బంది సమస్యలు పరిష్కరించేందుకు ఒక ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తామన్నారు. సిబ్బంది తమ సమస్యలను ఉన్నతాధికారులకు తెలియపర్చేందుకు ఒక ప్రత్యేక Grievance redressal mechanism/ ఫిర్యాదు పరిష్కార యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తామన్నారు.పిల్లలను చదువుల పట్ల శ్రద్ధ వహించాలన్నారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహిస్తూ దినచర్యలో వ్యాయామాన్ని భాగం చేసుకోవాలన్నారు. ఈ సమావేశంలో 200 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com