NEET పరీక్షలు ప్రారంభం

- September 12, 2021 , by Maagulf
NEET పరీక్షలు ప్రారంభం

న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా వైద్య కళాశాలల్లో ప్రవేశానికి నిర్వహించే జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్‌) ఆదివారం ప్రారంభమైంది. మధ్యాహ్నం 2 గంటలకు పరీక్ష మొదలైంది. అయితే 1.30 గంటలకే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలనే నిబంధన ఉండటంతో విద్యార్థులు ముందుగానే వచ్చారు. దేశ వ్యాప్తంగా 202 పట్టణాల్లో 3,842 పరీక్ష కేంద్రాల్లో నిర్వహిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు లక్ష మంది విద్యార్థులు నీట్‌ పరీక్షను రాస్తున్నారు. ఎపిలో 10 పట్టణాల్లోని 151, తెలంగాణాలో 7 పట్టణాల్లోని 112 కేంద్రాల్లో పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. కరోనా నిబంధనలను పాటిస్తూ ఈ పరీక్షలు జరుగుతున్నాయి. ఈ సారి పరీక్షను 11 ప్రాంతీయ భాషల్లో నిర్వహిస్తున్నారు. పరీక్ష కేంద్రంలోకి అడ్మిట్‌ కార్డు, ఫోటో, గుర్తింపు కార్డు మామ్రే అనుమతించినున్నట్లు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టిఎ) తన నియమ, నిబంధనల్లో తెలిపింది. సాయంత్రం ఐదు గంటలకు పరీక్ష ముగుస్తుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com