ఇంటెల్ ఇస్తున్న సంకేతాలు..బోర్డర్ సైనికులకు శిక్షణ
- September 13, 2021
జమ్మూకాశ్మీర్: జమ్మూకాశ్మీర్‌లో భద్రతను మరింత కట్టుదిట్టం చేసేందుకు భద్రతా బలగాలకు శిక్షణ ఇవ్వబోతున్నారు. ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్లు వేగంగా ఆ దేశాన్ని ఆక్రమించుకున్నారు. తాలిబన్ల నుంచి ఇతర దేశాలకు ముప్పు ఉండే అవకాశం ఉందని వస్తున్న వార్తల నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నది. తాలిబన్లను ఎదుర్కొనడానికి అవసరమైన శిక్షణను ఇచ్చేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఒకవేళ తాలిబన్లు జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రచర్యలకు తెగబడితే దానిని ఎలా ఎదుర్కోవాలి, వారిని ఎలా తరిమికొట్టాని, ఎలాంటి వ్యూహాలు అమలు చేయాలి వంటి అంశాలపై సైనికులకు శిక్షణ ఇవ్వనున్నారు. పోరాట వ్యూహాలపై బోర్డర్‌లోని చివరి సైనికుడి వరకు శిక్షణ ఇస్తామని సైనికాధికారులు చెబుతున్నారు. ఇతర దేశాల విషయంలో జోక్యం చేసుకోబోమని చెబుతున్నప్పటికీ వారి మాటలను ఎవరూ నమ్మేపరిస్థితుల్లో లేరు.
తాజా వార్తలు
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి
- మాలిలో ఐదుగురు భారతీయుల కిడ్నాప్ చేసిన గుర్తుతెలియని దుండగులు
- అమెరికా వీసా, గ్రీన్ కార్డ్ నిబంధనలు కఠినం..
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!







