రెసిడెన్సి చట్టాన్ని ఉల్లంఘించిన 96 మంది అరెస్ట్

- September 15, 2021 , by Maagulf
రెసిడెన్సి చట్టాన్ని ఉల్లంఘించిన 96 మంది అరెస్ట్

 కువైట్:కువైట్ రెసిడెన్సి చట్టాన్ని ఉల్లంఘించి దేశంలో అక్రమంగా నివసిస్తున్న 96 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. క్యాపిటల్ గవర్నరేట్ సెక్యూరిటీ డైరెక్టరేట్  బనీడ్ అల్-గార్ ప్రాంతంలో చేపట్టిన తనిఖీల్లో అక్రమ నివాసితులను గుర్తించి అరెస్ట్ చేసినట్లు అంతర్గత మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అరెస్టైన వారిలో రెసిడెన్సీ గడువు ముగిసిన వారు ముప్పై ఏడు మంది ఉన్నారు. ముగ్గురు పరారీ లిస్టులో ఉన్నారని వివరించింది. మిగిలిన 55 మందిని రెసిడెన్సీ ఉల్లంఘన ఆరోపణలపై అరెస్ట్ చేసినట్లు తెలిపింది. ఇదిలావుంటే..రెసిడెన్సీ గడువు ముగిసిన వారు, సరైన అనుమతులు లేని వారు దేశం విడిచి వెళ్ళాల్సిందిగా కోవిడ్ సమయంలోనే కువైట్ క్షమాభిక్ష ప్రకటించింది. దేశం విడిచి వెళ్ళేలా ఫ్రీ ఫ్లైట్ టికెట్లను ఏర్పాటు చేయడమే కాకుండా..వారిని బ్లాక్ లిస్టులో చేర్చబోమని కూడా స్పష్టంచేసింది. అయినా చాలామంది అక్రమ నిర్వాసితులు క్షమాభిక్ష ప్రయోజనాలను  సద్వినియోగం చేసుకోలేదని..వారిని గుర్తించి అరెస్ట్ చేస్తామని మంత్రిత్వశాఖ హెచ్చరించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com