రెసిడెన్సి చట్టాన్ని ఉల్లంఘించిన 96 మంది అరెస్ట్
- September 15, 2021కువైట్:కువైట్ రెసిడెన్సి చట్టాన్ని ఉల్లంఘించి దేశంలో అక్రమంగా నివసిస్తున్న 96 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. క్యాపిటల్ గవర్నరేట్ సెక్యూరిటీ డైరెక్టరేట్ బనీడ్ అల్-గార్ ప్రాంతంలో చేపట్టిన తనిఖీల్లో అక్రమ నివాసితులను గుర్తించి అరెస్ట్ చేసినట్లు అంతర్గత మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అరెస్టైన వారిలో రెసిడెన్సీ గడువు ముగిసిన వారు ముప్పై ఏడు మంది ఉన్నారు. ముగ్గురు పరారీ లిస్టులో ఉన్నారని వివరించింది. మిగిలిన 55 మందిని రెసిడెన్సీ ఉల్లంఘన ఆరోపణలపై అరెస్ట్ చేసినట్లు తెలిపింది. ఇదిలావుంటే..రెసిడెన్సీ గడువు ముగిసిన వారు, సరైన అనుమతులు లేని వారు దేశం విడిచి వెళ్ళాల్సిందిగా కోవిడ్ సమయంలోనే కువైట్ క్షమాభిక్ష ప్రకటించింది. దేశం విడిచి వెళ్ళేలా ఫ్రీ ఫ్లైట్ టికెట్లను ఏర్పాటు చేయడమే కాకుండా..వారిని బ్లాక్ లిస్టులో చేర్చబోమని కూడా స్పష్టంచేసింది. అయినా చాలామంది అక్రమ నిర్వాసితులు క్షమాభిక్ష ప్రయోజనాలను సద్వినియోగం చేసుకోలేదని..వారిని గుర్తించి అరెస్ట్ చేస్తామని మంత్రిత్వశాఖ హెచ్చరించింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్ స్కూళ్లల్లో ఇంగ్లిష్ లో సైన్స్, మ్యాథ్స్ బోధన
- కువైట్ లో వర్క్ పర్మిట్ జారీకి కీలక ప్రతిపాదనలు..!
- భారత ప్రయాణికులకు శుభవార్త..!
- దుబాయ్ లో కొత్తగా 30 పార్కుల నిర్మాణం..!
- 20 అవినీతి కేసులపై నజాహా దర్యాప్తు
- విద్యార్థుల కోసం 4 రెసిడెన్సీ వీసాలు..ఖర్చు, ప్రక్రియ
- వీసా నిబంధనలు కఠినతరం చేసిన ఆస్ట్రేలియా..
- ఇండియాకు ఒమన్ ఎయిర్ అదనపు సర్వీసులు
- ఫుజైరాలో వీధుల్లో వైల్డ్ క్యాట్ సంచారం..!
- రెసిడెన్సీ పర్మిట్ల కోసం లంచం.. నలుగురికి జైలుశిక్ష, జరిమానా