అంతరిక్షయానంలో స్పేస్ ఎక్స్ మరో మైలు రాయి

- September 16, 2021 , by Maagulf
అంతరిక్షయానంలో స్పేస్ ఎక్స్ మరో మైలు రాయి

అంతరిక్షయానంలో ప్రైవేట్ సంస్థలు పోటీపడుతున్నాయి. వర్జిన్ గెలాక్టిక్‌, బ్లూ ఆరిజిన్ సంస్థలు ఇప్పటికే అంతరిక్షయానంలో ముందడుగు వేశాయి. కాగా, ఇప్పుడు స్పేస్ ఎక్స్ సంస్థ మరో అడుగు ముందుకు వేసి భూకక్ష్యలోకి వ్యోమనౌకను పంపింది. ఈ వ్యోమనౌకలో నలుగురు పర్యాటకులు ఉన్నారు. వీరు మూడు రోజుల పాటు ఈ వ్యోమనౌకలో భూమిచుట్టూ ప్రదక్షణ చేస్తారు. మూడు రోజుల తరువాత వీరు తిరిగి భూమిమీదకు రానున్నారు. స్పేస్ ఎక్స్ సంస్థ ఇన్ఫిరేషన్ 4 పేరుతో ఈ ప్రయోగాన్ని చేపట్టింది. స్పేస్ ఎక్స్ తయారు చేసిన ఫాల్కన్ 9 అనే రాకెట్ ద్వారా ఈ ప్రయోగాన్ని చేపట్టారు. ఈ రాకెట్ 12 నిమిషాల్లో భూకక్ష్యను చేరుకోగానే దాని నుంచి డ్రాగన్ క్యాప్యూల్ విడిపోయింది. ఈ క్యాప్యూల్ భూమి చుట్టు తిరుగుతుంది. ఈ క్యాప్యూల్‌లో మొత్తం నలుగురు టూరిస్టులు ప్రయాణం చేశారు. ఈ ప్రయోగం సక్కెస్ కావడంతో స్పేస్ ఎక్స్ మరిన్ని ప్రయోగాలు చేసేందుకు సిద్ధం అయింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com