అంతరిక్షయానంలో స్పేస్ ఎక్స్ మరో మైలు రాయి
- September 16, 2021
అంతరిక్షయానంలో ప్రైవేట్ సంస్థలు పోటీపడుతున్నాయి. వర్జిన్ గెలాక్టిక్, బ్లూ ఆరిజిన్ సంస్థలు ఇప్పటికే అంతరిక్షయానంలో ముందడుగు వేశాయి. కాగా, ఇప్పుడు స్పేస్ ఎక్స్ సంస్థ మరో అడుగు ముందుకు వేసి భూకక్ష్యలోకి వ్యోమనౌకను పంపింది. ఈ వ్యోమనౌకలో నలుగురు పర్యాటకులు ఉన్నారు. వీరు మూడు రోజుల పాటు ఈ వ్యోమనౌకలో భూమిచుట్టూ ప్రదక్షణ చేస్తారు. మూడు రోజుల తరువాత వీరు తిరిగి భూమిమీదకు రానున్నారు. స్పేస్ ఎక్స్ సంస్థ ఇన్ఫిరేషన్ 4 పేరుతో ఈ ప్రయోగాన్ని చేపట్టింది. స్పేస్ ఎక్స్ తయారు చేసిన ఫాల్కన్ 9 అనే రాకెట్ ద్వారా ఈ ప్రయోగాన్ని చేపట్టారు. ఈ రాకెట్ 12 నిమిషాల్లో భూకక్ష్యను చేరుకోగానే దాని నుంచి డ్రాగన్ క్యాప్యూల్ విడిపోయింది. ఈ క్యాప్యూల్ భూమి చుట్టు తిరుగుతుంది. ఈ క్యాప్యూల్‌లో మొత్తం నలుగురు టూరిస్టులు ప్రయాణం చేశారు. ఈ ప్రయోగం సక్కెస్ కావడంతో స్పేస్ ఎక్స్ మరిన్ని ప్రయోగాలు చేసేందుకు సిద్ధం అయింది.
తాజా వార్తలు
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్‌లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్‌లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్‌లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!







