మస్కట్‌లో వలసదారులు ఇళ్ళు కొనుగోలు చేసే అవకాశం..
- September 16, 2021
మస్కట్: 23 ఏళ్ళ వయసు వస్తే, వలసదారులు హౌసింగ్ యూనిట్స్ కొనుగోలు చేయడానికి అవకాశం కలుగుతుంది. రెసిడెన్షియల్ మరియు కమర్షియల్ భవనాల్ని 99 ఏళ్ళకుగాను కొనుగోలు చేయవచ్చు. రెండేళ్ళ రెసిడెన్స్ పర్మిట్ తప్పక వుండాలి. 45,500 కంటే తక్కువ కాకుండా హౌసింగ్ యూనిట్ ధర వుండాలి. మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ మరియు అర్బన్ ప్లానింగ్ ఈ మేరకు డాక్యుమెంట్ జారీ చేసింది. ఉసుఫ్రక్ట్ విధానం ద్వారా భవనాల్ని కొనుగోలు చేసేందుకు వలసదారులకు ఆస్కారమిస్తున్నారు. సొంతంగా లేదంటే, ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్‌తో కలిసి భవనాల్ని కొనుగోలు చేసేందుకు వీలు కల్పిస్తున్నారు. హక్కుదారు మరణిస్తే, చట్టబద్ధ వారసులకు అది లభిస్తుంది. నాలుగు ఫ్లోర్స్ కంటే తక్కువ కాకుండా వుండే భవనాల్లోనే ఇంటిని కొనుగోలు చేయాల్సి వుంటుంది. నాలుగేళ్ళ లోపు నిర్మించిన భవనం అయి వుండాలి. 45,000 ఒమన్ రియాల్స్ అంతే కంటే ఎక్కువ ధర వుండాలి మస్కట్ పరిధిలో. సుల్తానేట్‌లోని ఇతర డైరెక్టరేట్లలో అయితే దీని ధర కనీసం 35,000 ఒమన్ రియాల్స్ వుండాలి.
తాజా వార్తలు
- ప్రింట్ మీడియాకు కేంద్రం శుభవార్త
- ఖతార్ స్కాలర్షిప్..850 మంది విద్యార్థులకు ప్రయోజనం..!!
- 'నిరం 2025' మెగా ఈవెంట్ టిక్కెట్లు ఆవిష్కరణ..!!
- ఇంటీరియర్ మినిస్ట్రీ ఆధ్వర్యంలో వాహనాలు ధ్వంసం..!!
- 22 మంది ఆసియా దేశాల మహిళలు అరెస్టు..!!
- ఇద్దరు చైనీయులను రక్షించిన సౌదీ సిటిజన్..!!
- యూఏఈలో ఉద్యోగులకు 4 రోజుల పాటు సెలవులు..!!
- మృతుల కుటుంబాలకు సీఎం రేవంత్ సర్కార్ రూ.5 లక్షలు పరిహారం
- కేబినెట్ సెక్రటేరియట్ DFO రిక్రూట్మెంట్ 2025
- ఒకే కుటుంబంలో 18 మంది మృతి







