కోనేరు ప్రసాద్ రాజీనామా తో షాక్ తిన్న 'వైసీపీ'

- March 16, 2016 , by Maagulf
కోనేరు ప్రసాద్ రాజీనామా తో షాక్ తిన్న 'వైసీపీ'

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి మరో షాక్‌ తగిలింది. ప్రముఖ పారిశ్రామిక వేత్త కోనేరు ప్రసాద్‌ ఆ పార్టీకి రాజీనామా చేశారు. గత ఎన్నికల్లో వైసీపీ ఎంపీ అభ్యర్థిగా విజయవాడలో పోటీ చేశారు. వ్యక్తిగత కారణాలతో రాజకీయాల నుంచి విరమించుకుంటున్నానని, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాని, తమ రాజీనామాను ఆమోదించాల్సింగా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డికి ఆయన లేఖ రాశారు. ఆ లేఖను బుధవారం ఆయన విడుదల చేశారు. ఇటీవలి కాలంలో వైసీపీలో జరుగుతున్న పరిణామాలు, దీంతోపాటు ఉత్తరాంధ్రలో కోనేరు ప్రసాద్‌కు బీచ్‌ సాండ్‌ ప్రాజెక్టు ఉంది. ఆ ప్రాజెక్టుపై ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో విశాఖకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌ రాజు దానిపై శాసనసభలో ప్రశ్నోత్తర సమయంలో లేవనెత్తారు. దీనిపై వెంటనే ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే కోనేరు రాజీనామా ప్రాధాన్యత సంతరించుకుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com