కువైట్లో పెరుగుతున్న నిరుద్యోగ రేటు

- September 19, 2021 , by Maagulf
కువైట్లో పెరుగుతున్న నిరుద్యోగ రేటు

కువైట్: కువైట్లో నిరుద్యోగుల రేటు పెరుగుతున్న‌ట్లు సెంట్ర‌ల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ స్టాటిస్టిక్స్ చెబుతున్నాయి.  సెంట్ర‌ల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ స్టాటిస్టిక్స్  జారీ చేసిన అధికారిక డేటా ప్రకారం, సివిల్ సర్వీస్ కమిషన్ లో నమోదు చేసుకున్న కువైట్ల నిరుద్యోగుల సంఖ్య జూన్ 2021 చివరి నాటికి 7,668 చేరుకుంది. వారిలో 46 శాతం మంది పురుషులు, 54 శాతం మహిళలు ఉన్నారు.  నిరుద్యోగుల‌లో బ్యాచిల‌ర్లు ఎక్కువగా ఉన్నార‌ని, పెళ్లి అయి ఉద్యోగం లేని వారు37.58  శాతం మంది ఉంటే...బ్యాచిల‌ర్ నిరుద్యోగులు 53.59 శాతం మంది ఉన్నార‌ని గ‌ణాంకాలు చెబుతున్నాయి. ఇదిలాఉంటే డిగ్రీ పూర్తి చేసిన నిరుద్యోగులు 50 శాతానికి, డిప్లొమా హోల్డర్లు 13 శాతానికి పెరిగిన‌ట్లు నివేదిక చెబుతోంది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com