స్పోర్ట్స్, కల్చరల్ ఈవెంట్లకు గ్రీన్ సిగ్నల్
- September 20, 2021
ఒమన్: కోవిడ్ పరిస్థితుల తర్వాత ఒక్కో రంగానికి మినహాయింపులు ఇస్తూ వస్తున్న సుప్రీం కమిటీ..తాజా క్రీడాప్రియులకు కూడా శుభవార్త అందించింది. దేశంలో స్పోర్ట్స్, కల్చరల్ ఈవెంట్ల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే..ఒమన్ ప్రభుత్వం ఆమోదం తెలిపిన వ్యాక్సిన్లలో ఏదైన ఒక వ్యాక్సిన్ను కనీసం సింగిల్ డోస్ అయిన తీసుకున్న వారినే అనుమతించాలని స్పష్టం చేసింది. అదే సమయంలో ఈవెంట్ వేదిక సామర్ధ్యంలో 50 శాతం మందిని మాత్రమే అనుమతించాలని తెలిపింది.
ఇదిలా ఉంటే...ఇరాన్, ఇరాక్ నుంచి ఒమన్ వచ్చే వారికి సంబంధించి క్వారంటైన్ నిబంధనలను కూడా సడలించింది. విదేశీ ప్రయాణికులను సెప్టెంబర్ 1 నుంచే క్వారంటైన్ నుంచి మినహాయింపు ఇచ్చినా..ఇరాన్, ఇరాక్ నుంచి వచ్చే వారు మాత్రం క్వారంటైన్ లో ఉండాలని గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే..ఇప్పుడా నిబంధనలను సడలిస్తూ ఇతర దేశాల ప్రయాణికులకు వర్తించిన నిబంధనలే ఈ రెండు దేశాలకు కూడా వర్తిస్తాయని ఒమన్ సుప్రీం కమిటీ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!
- BD800 మిలియన్లతో 50వేల హౌజింగ్ యూనిట్లు..!!
- సంక్షోభాన్ని ఐక్యతతో అధిగమించిన యూఏఈ









