కడుపులో కొకైన్ క్యాప్స్యూల్స్: దుబాయ్ విజిటర్కి పదేళ్ళ జైలు శిక్ష
- September 20, 2021
దుబాయ్: దుబాయ్ క్రిమినల్ కోర్టు 47 ఏళ్ళ వ్యక్తికి 10 ఏళ్ళ జైలు శిక్ష విధించింది. నిందితుడు, యూఏఈ పర్యాటకుడు. అతని నుంచి 49 కొకైన్ క్యాప్సూల్స్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు తన పొట్టలో కొకైన్ క్యాప్సూల్స్ వుంచుకుని వస్తుండగా, దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్ట్సమ్ అధికారులు పట్టుకున్నారు. అతని నుంచి కొకైన్ క్యాప్సూల్స్ని స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్ వెల్లడించింది. నిందితుడు, దుబాయ్లో వాటిని విక్రయించేందుకు ప్రయత్నించినట్లు అధికారులు వివరించారు. కాగా, నిందితుడికి 50,000 దిర్హాముల జరీమానా కూడా విధించారు. జరీమానా చెల్లింపు, జైలు శిక్ష అనంతరం నిందితుడ్ని దేశం నుంచి పంపించేస్తారు. కాగా, నిందితుడి కడుపులోని క్యాప్సూల్స్ని ఎక్స్ రే ద్వారా గుర్తించిన అధికారులు, కిలో బరువు గల కొకౌన్ అందులో వున్నట్లు కనుగొన్నారు. నిందితుడు ఆఫ్రియా జాతీయుడు. తన ఆర్థిక అవసరాల్ని గుర్తించి, స్వదేశంలో ఓ వ్యక్తి తనకు ఈ పని అప్పగించినట్లు విచారణలో నిందితుడు తెలిపాడు.
తాజా వార్తలు
- అమెరికాతో శాంతి చర్చలకు ముందు ఇరాన్ మరో రెండు కొత్త షరతులు..
- ఏప్రిల్ 14న దేశంలో తొలి క్వాంటం టెస్ట్ ఫెసిలిటీ ప్రారంభం
- 26 మందిని స్వదేశానికి రప్పించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశం
- ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్కు కొత్త దిశ
- ఇరాన్ దాడుల్లో గాయపడిన వారి చికిత్సపై అబూదాబి పోలీస్ చీఫ్ సమీక్ష
- యూపీలో ఘోర పడవ ప్రమాదం..10 మంది మృతి
- కేసీఆర్తో జీవన్ రెడ్డి భేటీ
- డ్రోన్ అటాక్స్ పై కువైట్ వార్నింగ్..!!
- ఖతార్లో భారత విదేశాంగ మంత్రి కీలక చర్చలు..
- సోహార్ లో భారీగా ఆల్కాహాల్ సీజ్..!!









