చురుగ్గా సాగుతున్న చైనా సొంత స్పేస్ స్టేషన్ పనులు
- September 20, 2021బీజింగ్: మానవరహిత స్పేస్‌క్రాఫ్ట్‌ను చైనా సోమవారం లాంచ్ చేసింది. అంతరిక్షంలో ఆ దేశం నిర్మిస్తున్న సొంత స్పేస్ స్టేషన్‌కు అవసరమైన సామగ్రిని ఇందులో పంపింది. దక్షిణ చైనా హైనాన్ ప్రావిన్స్‌లోని వెంచాంగ్ స్పేస్‌క్రాఫ్ట్ లాంచ్ సైట్ నుండి లాంగ్ మార్చ్ 7 రాకెట్‌ను సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రయోగించింది. చైనా నిర్మిస్తున్న స్పేస్ స్టేషన్‌కు సామగ్రిని సరఫరా చేయడానికి కార్గో అంతరిక్ష నౌక టియాన్జౌ -3ను దీని ద్వారా పంపినట్లు చైనా మానవ సహిత అంతరిక్ష సంస్థ (CMSA) పేర్కొన్నట్లు అధికారిక వార్తా సంస్థ జిన్హువా తెలిపింది. ఈ మిషన్‌కు సంబంధించిన 11 ప్రయోగాల్లో ఇది నాలుగోవదని వెల్లడించింది. చైనా సొంత స్పేస్ స్టేషన్ టియాంగాంగ్ 2022 నాటికి అందుబాటులోకి రావచ్చని భావిస్తున్నారు.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్‌లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్‌లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు