ఇకపై ఈ ప్రదేశాల్లో ఫేస్ మాస్క్ ధరించనక్కర్లేదు!!

- September 22, 2021 , by Maagulf
ఇకపై ఈ ప్రదేశాల్లో ఫేస్ మాస్క్ ధరించనక్కర్లేదు!!

యూఏఈ: కోవిడ్ మహమ్మారి వచ్చి దాదాపుగా రెండు సంవత్సరాలు అవుతున్నా, ఈ మాస్క్ ధరించటం అనేది బహు ఇబ్బందిగా ఉండటం మాత్రం కాదనలేని నిజం..తాజాగా, పలు బహిరంగ ప్రదేశాల్లో తప్పనిసరిగా మాస్కులు ధరించాలనే నిబంధనను తొలగించారు యూఏఈ అధికారులు. అయితే, ప్రజలు తప్పనిసరిగా రెండు మీటర్ల సామాజిక దూరాన్ని పాటించాల్సిందే అని నేషనల్ ఎమర్జెన్సీ క్రైసిస్ అండ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (NCEMA) బుధవారం, సెప్టెంబర్ 22 న ప్రకటించింది.

ఈ ప్రదేశాల్లో మాస్కులు ధరించాల్సిన అవసరం లేదు:
* బహిరంగ ప్రదేశాల్లో వ్యాయామం చేసేటప్పుడు.
* ప్రైవేట్ ట్రాన్స్‌పోర్టేషన్‌లో ప్రయాణిస్తుంటే (అనగా, ఒకే ఇంటి నుండి ప్రజలు ప్రయాణిస్తుంటే) 
* బీచ్‌కి వెళ్లేవారు 
* ఈత కొలనుల వద్ద ఉన్నవారు

ఎందుకీ నిర్ణయం?
గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఈ ఏడాది ఆగస్టులో రోజువారీ కోవిడ్ -19 కేసుల సంఖ్య 60 శాతం తగ్గుముఖం పట్టడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. మంగళవారం, దేశంలో కేవలం 322 కొత్త కేసులు నమోదయ్యాయి. అంతేకాకుండా, ప్రపంచంలోనే అత్యధిక వ్యాక్సిన్లు వేసిన దేశంగా ఖ్యాతి పొందింది యూఏఈ. వీరిలో 92 శాతం మంది నివాసితులు కనీసం ఒక డోస్ అందుకోగా..81 శాతానికి పైగా నివాసితులు వ్యాక్సిన్ రెండు డోసులు పూర్తిచేశారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com