మూడేళ్ళ వీసా: కనీస పెట్టుబడిలో మార్పులు చేసిన దుబాయ్

- September 24, 2021 , by Maagulf
మూడేళ్ళ వీసా: కనీస పెట్టుబడిలో మార్పులు చేసిన దుబాయ్

దుబాయ్: రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి రెసిడెన్షియల్ ప్రాపర్టీ మార్కెట్లో మూడేళ్ళ పెట్టుబడి ద్వారా లభించే వీసాకి సంబంధించి మార్పులు చేశారు. కనీస పెట్టుబడి మొత్తాన్ని 1 మిలియన్ దిర్హాముల నుంచి 750,000 దిర్హాములకు తగ్గించినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని దుబాయ్ ల్యాండ్ డిపార్టుమెంట్ వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు. డిఎల్‌డి తస్కీన్ ప్రోగ్రామ్ ద్వారా ఈ వీసా సౌకర్యం లభిస్తుంది. ఈ విధానంలో 750,000 దిర్హాముల విలువైన ప్రాపర్టీ సొంతం చేసుకునేవారికి మూడేళ్ళ రెన్యువబుల్ రెసిడెన్సీ వీసా లభిస్తుంది. జీవిత భాగస్వామిని స్పాన్సర్ చేసే అవకాశం ఈ వీసా దారులకు లభిస్తుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com