600 మందికి పైగా మహిళలకు ఉపాధి కల్పించిన హరామ్ ప్రెసిడెన్సీ

- September 25, 2021 , by Maagulf
600 మందికి పైగా మహిళలకు ఉపాధి కల్పించిన హరామ్ ప్రెసిడెన్సీ

మక్కా: జనరల్ ప్రెసిడెన్సీ ఫర్ ఎఫైర్స్ ఆఫ్ ది గ్రాండ్ మాస్క్ మరియు ప్రొఫెట్ మాస్క్ సంబంధిత ఏజెన్సీల వద్ద 600 మంది మహిళలు పని చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. అసిస్టెంట్ జనరల్ ప్రెసిడెంట్, విమెన్స్ డెవలప్మెంట్ ఎఫైర్స్ డాక్టర్ అల్ అమౌద్ బింట్ ఖాలిద్ అల్ అబౌద్ మాట్లాడుతూ, టెక్నికల్ ఎఫైర్స్ అసిస్టెన్స్ ఏజెన్సీ, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్స్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ విమెన్, అసిస్టెన్స్ ఏజెన్సీ ఫర్ పబ్లిక్ రిలేషన్స్ మరియు మీడియా ఎఫైర్స్ వంటి విభాగాల్లో మహిళలకు అవకాశాలు కల్పించినట్లు చెప్పారు. లాంగ్వేజెస్మరియు విమెన్స్ ట్రాన్స్‌లేషన్ అసిస్టెన్స్ ఏజెన్సీ విభాగంలో 100 మందికి అవకాశం కల్పించారు. విమెన్ సర్వీసెస్ మరియు ఫీల్డ్ ఎఫైర్స్ విభాగంలో 210 మంది పని చేస్తున్నారు. వివిధ విభాగాల్లో మరింత మంది మహిళలకు అవకాశాలు కల్పిస్తున్నట్లు సంబంధిత వర్గాలు వివరించాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com