ఢిల్లీలో సీఎం కేసీఆర్ టూర్ కొనసాగుతుందిలా..
- September 25, 2021
న్యూ ఢిల్లీ: మూడురోజుల పర్యటనకుగాను శుక్రవారం ఢిల్లీ వెళ్లిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్... ఈరోజు కేంద్ర జల్‌శక్తిశాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌తో సమావేశం కానున్నారు. కృష్ణా, గోదావరి నదులపై ప్రాజెక్ట్‌లను బోర్డుల పరిధిలోకి తెస్తూ కేంద్రం విడుదల చేసిన గెజిట్‌పై కేంద్రమంత్రితో చర్చించనునన్నారు. బోర్డుల పరిధిలోకి తెచ్చే గడువును పెంచాలని తెలంగాణ సర్కార్ కోరుతోంది. ఈ నెల మొదట్లోనే కేంద్రమంత్రి షెకావత్‌తో సీఎం భేటీ అయ్యారు. అయినా గడువును పెంచలేదు. దీంతో మరోసారి కేంద్రమంత్రిని కలిసి చర్చించనున్నారు.
తెలుగు రాష్ట్రాల మధ్య కొన్నిరోజులుగా జలజగడం నెలకొంది. అక్రమంగా ప్రాజెక్టులు కడుతూ.. తమ నీళ్లను తరలించుకుని పోతున్నారని ఒకరిపై మరొకరు ఆరోపణలు గుప్పిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం తీరుపై ఏపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. దీనిపై ఇప్పటికే కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖతో పాటు కేఆర్‌ఎంబీకి ఫిర్యాదు చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్... కేందమంత్రి గజేంద్ర షెకావత్‌తో సమావేశం కావడం హాట్‌టాపిక్‌గా మారింది.
తాజా వార్తలు
- తెలంగాణ: ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు..
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్‌తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్
- ఏప్రిల్ 26 నుండి జజీరా ఎయిర్వేస్ నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం
- యువ టెక్ మేధస్సుల కోసం 'టినీ టెక్నీస్-2కే26' టెక్నో స్కిల్స్ బూట్‌క్యాంప్
- SR 4 మిలియన్ల ఫైన్స్ వేసిన ఆరోగ్య బీమా మండలి..!!
- కువైట్ లో సామాజిక సమావేశాల పై నిషేధం ఎత్తివేత..!!
- షార్జాలోని అల్ ధైద్‌లో 13 టన్నుల పాడైన ఫుడ్ ధ్వంసం..!!
- విదేశాంగ మంత్రితో అమెరికా రాయబారి సమావేశం..!!
- అల్ సీబ్‌లో డ్రగ్ కలకలం..అరబ్ జాతీయుడు అరెస్టు..!!









