IPL:ఆన్ లైన్ బెట్టింగ్ ముఠా గుట్టు రట్టు !
- September 29, 2021
హైదరాబాద్: ఐపీఎల్ మొదలైందంటే చాలు బెట్టింగ్ వీరులు రంగంలో దిగుతారు.. కోట్ల రూపాయలు కొల్లగొడతారు. ఆన్ లైన్ స్వేచ్ఛగా నడుస్తున్న బెట్టింగ్ ని అధికారులు కట్టడి చేయలేక పోతున్నారు. ఎప్పటికప్పుడు సీజన్ వారీగా బెట్టింగ్ మాఫియా ను పట్టుకొని కటకటా ల వెనక్కి నిట్టిన ప్రయోజనం లేకుండా పోతుంది . తాజాగా ఆన్ లైన్ బెట్టింగ్ ముఠా ను సైబరాబాద్ పోలీసులు పట్టుకున్నారు.
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో భారీ ఐపిఎల్ బెట్టింగ్ రాకేట్ బయటపడింది. బెట్టింగ్ కు పాల్పడుతున్న 23 మంది బుకీలను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆన్ లైన్ యాప్స్ కేంద్రంగా జరుగుతన్న ఈ బెట్టింగ్ రాకేట్ రెండు తెలుగు రాష్ట్రల్లో లక్షల రూపాయలు కొల్లగొడుతోందని సైబరాబాద్ సిపి స్టీఫెన్ రవీంద్ర తెలిపారు.
కరోనా పరిస్థితుల నుంచి కోలుకుని దుబాయ్ వేదిక జరుగుతున్న ఐపిఎల్ సెకండ్ సీజన్ ను టార్గెట్ చేసుకున్నారు బెట్టింగ్ కేటుగాళ్లు. భారీ ఎత్తున్న బెట్టింగ్ కు పాల్పడుతున్న బుకీలను మాటు వేసి పట్టుకున్నారు మాదాపూర్ ఎస్వోటి పోలీసులు. పక్కా సమాచారంతో మాదాపూర్ మియాపూర్, బాచుపల్లి, గచ్చిబౌలి, మైలార్‌దేవ్‌పల్లితో పాటు ఏడు చోట్ల దాడులు నిర్వహించాగా.. 23 మంది బుకీలను అరెస్టు చేశారు. వారి వద్ద రూ.93 లక్షలు నగదు సీజ్ చేశారు పోలీసులు. అంతే కాకుండా మొత్తం రూ.2.2 కోట్ల విలువ చేసే బెట్టింగ్ సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు.
గూగుల్‌లో ఉన్న మొబైల్ యాప్‌తో ఈ ముఠా బెట్టింట్కు పాల్పడుతోంది. మొత్తం బెట్టింగ్‌ను నాలుగు లేయర్స్‌లో నిర్వహిస్తున్నారు. మెయిన్ బుకీకి అనుసంధానంగా మరో ముగ్గురు పని చేస్తారు. మొబైల్ యాప్స్ నుంచి సమాచారం తీసుకుని బెట్టింగ్ జరుపుతున్నారు. ముంబై, గోవా, దుబాయ్‌లలో వీరికి నెట్వర్క్ ఉన్నట్లు గుర్తించారు. విజయవాడకు చెందిన మహా అనే వ్యక్తి మెయిన్ బుకీగా ఉన్నాడు.. అయితే బెట్టింగ్ కు సహకరించే ఆన్ లైన్ యాప్స్ ఫాన్సీ లైఫ్ ఎంటర్టైన్మెంట్ యాప్ , లైవ్ లైన్ గురు, క్రికెట్ మజా, లోటస్ బెట్ 365, బెట్ ఫెయిర్ యాప్ ల ను నిషేదించెలా గూగల్ కు లేఖ రాస్తామని సైబారాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. అలాగే బెట్టింగ్ నిర్వహిస్తూ చాలా మంది అప్పుల పాలవుతున్న నేపథ్యంలో పిల్లల ఫోన్లపై తల్లిదండ్రులు దృష్టి పెట్టాలి” అని సీపీ ప్రజలకు సూచించారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..