జీఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ – NILDల ఆధ్వర్యంలో దివ్యాంగులకు ఉపకరణాలు పంపిణీ

- September 29, 2021 , by Maagulf
జీఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ – NILDల ఆధ్వర్యంలో దివ్యాంగులకు ఉపకరణాలు పంపిణీ

హైదరాబాద్: GMR గ్రూపు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ విభాగమైన GMR వరలక్ష్మి ఫౌండేషన్ (GMRVF) 400 మంది శారీరక వికలాంగులకు సహాయ పరికరాలు, ఉపకరణాలను పంపిణీ చేయడానికి ప్రత్యేక శిబిరాలు నిర్వహించింది. ఈ శిబిరాలు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ లోకోమోటర్ డిసెబిలిటీ (NILD) సమన్వయంతో తెలంగాణలోని మూడు ప్రదేశాలలో – సూర్యాపేట (26వతేదీ), చౌటుప్పల్ (27వ తేదీ) మరియు శంషాబాద్‌లో (సెప్టెంబర్29న) నిర్వహించారు. 

కోల్‌కతాలోని NILD, భారత ప్రభుత్వంలోని సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖలోని దివ్యాంగుల సాధికారత శాఖ కింద ఒక స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థ. దీని లక్ష్యం దేశంలోని వివిధ ప్రాంతాలలో వైకల్య అంచనా శిబిరాలు నిర్వహించి, వికలాంగులకు అవసరమైన సహాయ పరికరాలు, ఉపకరణాలను ఉచితంగా అందించడం.

GMRVF గతంలో NILD తో భాగస్వామ్యంతో తమ ప్రాజెక్ట్ ప్రదేశాలలో రెండు సంవత్సరాల పాటు వైకల్య అంచనా శిబిరాలు, సహాయ పరికరాలు, ఉపకరణాల పంపిణీని నిర్వహించింది. దీనిలో భాగంగా, GMRVF లబ్ధిదారులను తమ ప్రాంగణంలో జరిగే క్యాంపులకు చేరుస్తుంది. ఈ కార్యక్రమానికి అవసరమైన అన్ని రవాణా సదుపాయాలు, ఇతర ఏర్పాట్లు చేస్తుంది.

2019-20లో, NILD తెలంగాణలో నాలుగు ప్రదేశాలలో - సూర్యాపేట, చౌటుప్పల్, తూప్రాన్, శంషాబాద్ - అవసరమైన లబ్ధిదారులను గుర్తించడానికి వైకల్య అంచనా శిబిరాలను నిర్వహించింది. ఈ ప్రదేశాల నుండి మొత్తం 400 మంది దివ్యాంగ లబ్ధిదారులను గుర్తించారు. అయితే కోవిడ్ మహమ్మారి కారణంగా, ఈ పంపిణీ కార్యకలాపాలు ఆగిపోయాయి. ప్రస్తుతం కోవిడ్ పరిస్థితి ఇప్పుడు నియంత్రణలో ఉన్నందున, ఈ కార్యక్రమం తిరిగి ప్రారంభమైంది. దివ్యాంగులకు ఇచ్చే సహాయ పరికరాలు, ఉపకరణాలలో చక్రాల కుర్చీలు, చేతితో నడిచే ట్రైసైకిళ్లు, కృత్రిమ అవయవాలు, వినికిడి పరికరాలు, క్రచెస్, వాకింగ్ స్టిక్స్, ఫోల్డబుల్ వాకర్స్ మొదలైనవి ఉన్నాయి.

ఈ సందర్భంగా GMRVF CEO, PKSV సాగర్ మాట్లాడుతూ, "ఈ కార్యక్రమం ద్వారా NILD తో భాగస్వామి కావడం, దివ్యాంగులకు మా వంతు సహాయాన్ని అందించడం సంతోషంగా ఉంది. అవసరమైన వారికి సేవలందించే విషయంలో GMRVF ఎల్లప్పుడూ ముందు వరుసలో ఉంటుంది. ఈ సహాయా పరికరాలు, ఉపకరణాల పంపిణీ వల్ల దివ్యాంగులు ఇతరుల మీద ఆధారపడకుండా, తమ రోజువారీ పనులను సులభంగా చేయడంలో సహాయపడతాయని  మేము ఆశిస్తున్నాము.’’ అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com