హైదరాబాద్‌పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం.!
- September 30, 2021

యూఏఈ: సన్‌రైజర్స్ హైదరాబాద్(ఎస్ఆర్హెచ్) జట్టు మరోసారి నిరాశాజనక ప్రదర్శన చేసింది. చెన్నై సూపర్‌కింగ్స్‌తో గురువారం జరిగిన ఐపిఎల్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 134 పరుగులకే పరిమితమైంది. 11 ఓవర్లకు 3 వికెట్లు కోల్పోయి 66 పరుగులు చేసి భారీస్కోర్ సాధించేలా కనిపించిన సన్‌రైజర్స్ ఆ తర్వాత వరుసగా వికెట్లను కోల్పోయి స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది. టాస్ ఓడి తొలిగా బ్యాటింగ్‌కు దిగిన సన్స్రైజర్స్ను ఓపెనర్ వృద్ధిమాన్ సాహా చేసిన 44 పరుగుతో రాణించినా.. జేసన్ రారు(2) నిరాశపర్చాడు. గత మ్యాచ్‌లో ఒంటిచేత్తో మ్యాచ్‌ను గెలిపించిన జేసన్ రారు.. కేవలం 2 పరుగులు చేసి ఔటయ్యాడు. కెప్టెన్ కేన్ విలియమ్సన్(11), రియాన్ పరాగ్(7), హోల్డర్(5) ఘోరంగా విఫలం కాగా.. అభిషేక్ శర్మ(18), అబ్దుల్ సమద్(18) ఫర్వాలేదనిపించారు. రెండో అర్ధభాగంలో చెన్నై బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో సన్‌రైజర్స్ జట్టు భారీస్కోర్‌పై ఆశలు వదుకుకుంది. హేజెల్వుడ్కు మూడు, బ్రావోకు రెండు, శార్దూల్ ఠాకూర్, రవీంద్ర జడేజాకు తలా ఒక వికెట్ దక్కాయి.
స్కోర్‌బోర్డు..
సన్‌రైజర్స్ హైదరాబాద్: జేసన్ రారు (సి)ధోనీ (బి)హేజిల్‌వుడ్ 2, సాహా (సి)ధోనీ (బి)జడేజా 44, విలియమ్సన్ (ఎల్బి) బ్రేవో 11, రియాన్ పరాగ్ (సి)ధోనీ (బి)బ్రేవో 7, అభిషేక్ శర్మ (సి)డుప్లెసిస్ (బి)హేజిల్‌వుడ్ 18, అబ్దుల్ సమద్ (సి)మొయిన్ (బి)హేజిల్‌వుడ్ 18, హోల్డర్ (సి)దీపక్ చాహర్ (బి)శార్దూల్ 5, రషీద్ ఖాన్ (నాటౌట్) 17, భువనేశ్వర్ (నాటౌట్) 2, అదనం 10. (20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి) 134 పరుగులు.
వికెట్ల పతనం: 1/23, 2/43, 3/66, 4/74, 5/109, 6/110, 7/117
బౌలింగ్: దీపక్ చాహర్ 4-0-32-0, హేజిల్‌వుడ్ 4-0-24-3, శార్దూల్ ఠాకూర్ 4-0-37-1, బ్రేవో 4-0-17-2, జడేజా 3-0-14-1, మొయిన్ అలీ 1-0-5-0





తాజా వార్తలు
- ఏపీ: పోర్టుల అభివృద్ధికి కీలక చర్యలు
- ఫ్రాన్స్ నుంచి 114 రాఫెల్ జెట్లను కుదుర్చుకున్న భారత్
- ఇరాన్ నుంచి స్వదేశానికి చేరుకున్న భారతీయులు
- స్కూల్ పిక్నిక్లో స్టేల్ ఫుడ్.. పేరెంట్స్ ఫైర్..!!
- ప్రైజ్ అవార్డులపై కువైట్ సెంట్రల్ బ్యాంక్ కీలక నిర్ణయం..!!
- ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన కింగ్ సల్మాన్..!!
- ఆరాద్లోని మినీ హెరిటేజ్ విలేజ్‌లో అగ్నిప్రమాదం..!!
- వైరల్ ఛాలెంజ్ లపై దుబాయ్ పోలీసుల వార్నింగ్..!!
- 2026లోనూ ఖతార్ టూరిజం దూకుడు..!!
- కేఏ పాల్‌కు అమెరికాలో అరుదైన గౌరవం..







