ప్రపంచంలోనే అతి పెద్ద షో దుబాయ్ ఎక్స్‌పో 2020 ప్రారంభం
- October 01, 2021
దుబాయ్: కరోనా పాండమిక్ నేపథ్యంలో ఏడాది పాటు ఆలస్యమయిన ఎక్స్‌పో 2020 దుబాయ్, అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యింది. 3000 మంది ప్రేక్షకుల సమక్షంలో ప్రారంభ కార్యక్రమం జరిగింది. ప్రపంచ ప్రఖ్యాత టెనార్ ఆండ్రియా బోసెల్లి, ప్ముఖ సింగర్ మరియు సాంగ్ రైటర్ ఆండ్రా డే, మరో ప్రముఖ సాంగ్ రైటర్ ఎల్లీ గౌల్డింగ్, అంతర్జాతీయ పియానిస్ట్ లాంగ్ లాంగ్, నాలుగు సార్లు గ్రామీ విజేతగా నిలిచిన ఆంజెలిక్ కిడ్జో తదితరులతో ప్రారంభ కార్యక్రమాలు జరుగుతున్నాయి. యూఏఏ వ్యాప్తంగా అలాగే ప్రపంచ వ్యాప్తంగా 480 చోట్ల లైవ్ స్ట్రీమింగ్ అయ్యేలా ఏర్పాట్లు చేశారు. శుక్రవారం అత్యద్భుతమైన రీతిలో ఫైర్ వర్క్స్ ప్రదర్శన వుంటుంది. ఆరు నెలలపాటు ఈ ఈవెంట్ జరుగుతుంది. 25 మిలియన్ల మంది ఈ ఈవెంట్‌ని సందర్శించనున్నారు. 200 మంది పార్టిసిపెంట్స్ 192 దేశాల నుంచి ఈ ఈవెంట్‌లో పాల్గొంటారు. గంటకు 44,000 మంది ప్రయాణీకుల్ని ఈ ఈవెంట్‌కి తీసుకొచ్చేలా రవాణా సౌకర్యాలూ ఏర్పాటయ్యాయి. 200 డైనింగ్ స్పాట్స్, ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలకు చెందిన అత్యద్భుతమైన రుచుల్ని అందించనున్నాయి.
తాజా వార్తలు
- DXB టెర్మినల్ 1 కి వెళ్లే బ్రిడ్జి విస్తరణ..!!
- కువైట్ లో జీరో టెంపరేచర్స్ పై హెచ్చరిక..!!
- బహ్రెయిన్ ప్రభుత్వ పాఠశాలల్లో స్పెషల్ స్పోర్ట్స్ ట్రైనర్లు..!!
- దోహా అంతర్జాతీయ బుక్ ఫెయిర్ అవార్డుకు నామినేషన్లు..!!
- న్యూ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నిర్మాణంపై జజాన్ ఎమిర్ సమీక్ష..!!
- రష్యా, ఒమన్ సంబంధాల బలోపేతంపై సమీక్ష..!!
- యాదగిరిగుట్ట ఈవోగా భవాని శంకర్
- పార్ట్‌టైం జాబ్ చేశారనే అనుమానంతో అమెరికాలో ఇండియన్ స్టూడెంట్స్ అరెస్ట్!
- JEE Main 2026 : అడ్మిట్ కార్డులు విడుదల..
- చిన్నస్వామిలో మ్యాచ్‌లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్







