భారత్‌లో కరోనా కేసుల వివరాలు
- October 01, 2021
న్యూ ఢిల్లీ: భారత్‌లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. రెండు రోజుల క్రితం వరకు తగ్గుతూ వస్తున్న కేసులు మళ్లీ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా భారత్‌లో గడిచిన 24 గంటల్లో 26,727 కొత్త కేసులు నమోదయినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ రిలీజ్ చేసిన బులిటెన్‌లో పేర్కొన్నది. దీంతో భారత్‌లో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 3,37,66,707కి చేరింది.ఇందులో 3,30,43,144 మంది కోలుకోగా, 2,75,224 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. ఇక, గడిచిన 24 గంటల్లో భారత్‌లో కరోనాతో 277 మంది మృతి చెందారు.దీంతో భారత్‌లో ఇప్పటి వరకు మొత్తం కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 4,48,339కి చేరింది.దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది.గడిచిన 24 గంటల్లో 64,40,451 మందికి వ్యాక్సిన్ అందించారు. దీంతో ఇప్పటి వరకు భారత్‌లో 89,02,08,007 మందికి టీకాలు వేసినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







