మెట్రో రైల్లో 75 శాతం కెపాసిటీతో ప్రయాణానికి అనుమతి. ఆదివారం నుంచి సేవలు

- October 01, 2021 , by Maagulf
మెట్రో  రైల్లో 75 శాతం కెపాసిటీతో ప్రయాణానికి అనుమతి. ఆదివారం నుంచి సేవలు

ఖతార్: దోహ మెట్రో  రైల్లో 75 శాతం కెపాసిటీతో ప్రయాణానికి అనుమతివ్వాలని నిర్ణయించారు. కరోనా కారణంగా చాలా రోజుల నుంచి మెట్రో ప్రయాణాల్లో ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఐతే కరోనా ఎఫెక్ట్ కాస్త తగ్గటంతో మెట్రో రైల్లో 75 కెపాసిటీతో ప్రయాణానికి అనుమతివ్వాలని ట్రాన్స్ పోర్ట్ అండ్ కమ్యూనికేషన్స్ మినిస్ట్రీ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని డిపార్ట్ మెంట్ అధికారులు  సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ఆదివారం నుంచి సేవలు ప్రారంభం కానున్నాయి. కరోనా ఆంక్షలను నెమ్మదిగా ఎత్తివేసే చర్యల్లో భాగంగా మెట్రో రైళ్ల కెపాసిటీ పెంచుతున్నామని అధికారులు తెలిపారు. ప్రయాణాల్లో అన్ని ప్రీ కాషన్స్ తీసుకుంటామన్నారు. రైల్వే స్టేషన్లలో తినటం, స్మోకింగ్ కు అనుమతి లేదని స్పష్టం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com