భారత్‌లో కరోనా కేసుల వివరాలు

- October 03, 2021 , by Maagulf
భారత్‌లో కరోనా కేసుల వివరాలు

న్యూ ఢిల్లీ: భారత్‌లో క‌రోనా కేసులు పెరుగుతూ, తగ్గుతూ వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం తాజాగా క‌రోనా బులిటెన్‌ను విడుద‌ల చేసింది. ఈ బులిటెన్ ప్రకారం, గ‌డిచిన 24 గంట‌ల్లో భారత్‌లో 22,842 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. ఇందులో 3,30,94,529 మంది కోలుకొని డిశ్చార్జ్‌ కాగా, 2,70,557 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. ఇక‌, గ‌డిచిన 24 గంట‌ల్లో భారత్‌లో క‌రోనాతో 244 మంది మృతి చెందారు. దేశంలో ఇప్పటి వ‌ర‌కు మొత్తం 4,48,817 మంది క‌రోనాతో మృతి చెందారు. ఒక్క రోజులో దేశంలో 25, 930 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దేశంలో ఇప్పటి వరకు 90,51,75,348 కరోనా వ్యాక్సిన్‌ లు వేసినట్లు ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com