రీ-ఎంట్రీ బ్యాన్‌తో ఇల్లీగల్ వర్కర్లను దేశం నుంచి బహిస్కరించిన ఎల్ఎంఆర్ఎ

- October 04, 2021 , by Maagulf
రీ-ఎంట్రీ బ్యాన్‌తో ఇల్లీగల్ వర్కర్లను దేశం నుంచి బహిస్కరించిన ఎల్ఎంఆర్ఎ

బహ్రెయిన్: ఎల్ఎంఆర్ఎ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం, తనిఖీల్లో ఉల్లంఘనలకు పాల్పడుతూ దొరికిన కార్మికులకు భవిష్యత్తులో వర్క్ పర్మిట్లు జారీ చేసే ప్రసక్తే లేదని తెలుస్తోంది. దేశం విడిచి వెళ్ళడం తప్ప, వారికి మరో అవకాశం వుండదని డాక్టర్ ఖాలెద్ ముహమ్మద్ అబ్దుల్ రహ్మాన్ చెప్పారు. వారికి దేశంలోకి తిరిగి వచ్చే అవకాశం కూడా ఇవ్వబోమన్నారు. సాసా వీధిలో షాపులపై ప్రధానంగా దృష్టి పెట్టి తనిఖీలు నిర్వహిస్తున్నారు. వీధి వ్యాపారుల్ని కూడా తనిఖీలు చేస్తున్నారు. పలు ప్రభుత్వ శాఖలతో కలిసి తనిఖీల చేపడుతున్నారు. నేషనాలిటీ పాస్‌పోర్ట్స్ మరియు రెసిడెన్సీ ఎఫైర్స్, క్యాపిటల్ పోలీస్ డైరెక్టరేట్, మినిస్ట్రీ ఆఫ్ ఇండస్ట్రీ, ట్రేడ్ మరియు టూరిజం అలాగే మినిస్ట్రీ ఆఫ్ వర్క్స్ మునిసిపాలిటీస్ ఎఫైర్స్ మరియు అర్బన్ ప్లానింగ్ విభాగాలతో కలిసి శుక్రవారం తనిఖీలు నిర్వహించారు. 17506055 నెంబరుకి ఫోన్ చేసి కూడా ఉల్లంఘనలపై సమాచారం ఇవ్వవచ్చు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com